ఆంధ్రప్రదేశ్‌

‘ఇంజక్షన్’ ఘటనలో మరో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 9 : రిమ్స్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించిన ఘటనలో మరో మహిళ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. గురువారం సరుబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన తుమ్మ గరికమ్మ (60) అనే వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. సెప్ట్రియాక్సిన్ ఇంజక్షన్ ఐపి 1జి అనే సూదిమందు నలుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి అంటే సిక్కోలు జనాలు హడలెత్తిపోతున్నారు. ఈ నెల 3న రిమ్స్ మహిళా వార్డులో రోగులకు ఈ ఇంజక్షన్ ఇవ్వడం, 10 నిమిషాల్లోనే వికటించి తీవ్ర అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. విషమంగా ఉన్న రోగులను విశాఖకు తరలించి వైద్య సేవలు అందించినప్పటికీ పలాసకు చెందిన అనిత(24), కొత్తూరుకు చెందిన శైలు(28), కుప్పిలికి చెందిన దుర్గమ్మ మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం మరో నలుగురిని రిమ్స్ నుండి కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న సరుబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన గరికమ్మ వైద్యులకు ఆ సమాచారం ఇవ్వకుండా ఆమె కుటుంబ సభ్యులు కేజీహెచ్ నుంచి ఇంటికి తీసుకెళ్లిళ్లిపోయారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఇచ్చిన సమాచారంతో రిమ్స్ వైద్యులు గరికమ్మ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి చికిత్స అందిస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం మరో మారు వైద్యులు చెప్తున్నా వినిపించుకోకుండా గరికమ్మను ఇంటికి తీసుకెళ్లిపోయారు.
బుధవారం రాత్రి గరికమ్మ ఇంటి వద్ద తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తీసుకొచ్చారు. రిమ్స్ వైద్యులు సేవలు అందించినా గరికమ్మ ప్రాణాలు కాపాడలేకపోయారు.