ఆంధ్రప్రదేశ్‌

లాలూను మించిన చంద్రబాబు అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 9: బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ పాల్పడిన కుంభకోణాల కంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువ కుంభ కోణాలు జరిగాయని, అవినీతిలో లాలూను బాబు మించిపోయారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న అనేక ప్రజా సంక్షేమ పథకాలను తాము అమలుచేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరిస్తోందని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం పద్మజ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందన్నారు. సుమారు రూ.53 వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళించి, భారీ అవినీతికి పాల్పడ్డారని తమ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చేసిన ఆరోపణలకు సమాధానమివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అవినీతి ఆరోపణలు జీర్ణించుకోలేక తిరిగి విమర్శలు చేస్తున్నారన్నారు. నిధుల దుర్వినియోగంపై నిలదీసిన జీవీఎల్ నరసింహరావును విమర్శించడం ఎంతమాత్రం సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు. రూ.53 వేల కోట్లు దుర్వినియోగమైనట్టు సాక్షాత్తూ కాగ్ నివేదిక ఇచ్చిందని, ఇదే విషయాన్ని తమ ఎంపీ బహిర్గతం చేశారని పేర్కొన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను నియమించి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందనే విషయమై పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు బీజేపీ శ్రేణులు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటం విధిగా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రానికిచ్చిన విభజన హామీలను అమలుచేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తుమ్మల పద్మజ చెప్పారు. సమావేశంలో బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.