ఆంధ్రప్రదేశ్‌

అనంతను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 9: వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో కరవు పరిస్థితులు నెలకొన్న అనంతపురం జిల్లాను ఆదుకుంటామని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.
జిల్లాలోని 63 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. గురువారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితుల్ని ముందస్తుగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు. సాధారణంగా ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ఆఖరులో రాష్ట్రంలో కరవు మండలాల ప్రకటన చేసేదని, అయితే ఈ ఏడాది జూన్, జూలైలో కురిసిన వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే కరవు మండలాలను ప్రకటించిందన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి నెలకొని ఉన్న తీవ్ర వర్షాభావం నేపథ్యంలో జిల్లా మొత్తాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే కొంత వర్షం కురియడంతో కొంతమంది రైతులు వేరుశనగ విత్తనం వేశారని, అయితే సకాలంలో వర్షం రాకపోవడంతో విత్తిన విత్తనాలు మొలకెత్తక పోవడం, మొలకెత్తిన వేరుశనగ పంట ఎండిపోవడం, అదుపుదాటి పోవడంతో విత్తనం విత్తినా వృథా అని అమ్ముకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో జూన్, జూలై నెలల్లో కురిసిన వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోనూ నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల్ని ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు.
ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఓవైపు వర్షాధార పంటలు దెబ్బ తింటున్నందున శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు తీసుకొచ్చి, జిల్లాలో అవకాశమున్నంత వరకు ఆయా ప్రాంతాల్లో పంటల్ని ఆదుకోవడం, చెరువులు, తుంగభద్ర ఆయకట్టు కింద పంటలు పండించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ఉన్నంతలో సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకొస్తామని మంత్రి చెప్పారు.