ఆంధ్రప్రదేశ్‌

సమస్యలు పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 10: టీటీడీలో పనిచేస్తున్న అన్ని ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించి తగు న్యాయం చేస్తామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, బోర్డు సభ్యుడు చల్లారామచంద్రారెడ్డి ఉద్యోగ సంఘ నేతలకు హామీ ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం టీటీడీలోని వివిధ విభాగాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్న విషయం విదితమే. అయితే టీటీడీ పీఆర్వో డాక్టర్ రవికుమార్, సీవీ ఎస్ ఓ ఇన్‌చార్జ్ శివకుమార్ రెడ్డి గురువారం రాత్రి వరకు ఉద్యోగ సంఘ నేతలతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ఓ వైపు అష్టదిగ్బంధన బాలాలయ మహా సంప్రోక్షణ, మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఉద్యోగులు సమ్మెకు దిగితే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారోఅటు తరువాత సమాజంలో ఉద్యోగుల పట్ల ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయో తెలిపారు. అదేసమయంలో ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు సంబంధించి పాలకమండలి చైర్మన్ సభ్యులతోనూ, టీటీడీ ఉన్నతాధికారులతోనూ సమావేశమై సామరస్యంగా సమస్యలు పరిష్కరించేందుకు అందరం కలిసి కృషిచేద్దామని హితవుపలికారు. దీంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడకుండా ముందుగా సామరస్య ధోరణితో వ్యవహరించి సమస్యల పరిష్కారం కోసం యోచన చేయాలని ఉద్యోగ సంఘ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం తిరుపతి పద్మావతి అతిథి భవనంలో పాలక మండలి చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్, బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డితో ఉద్యోగ సంఘ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఇస్రో లాంటి సంస్థల్లో ఉద్యోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలు, అమలుచేస్తున్న వైద్య విధానాలు తమకూ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 29 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన సర్వీస్ రూల్స్ విధానాలను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులుచేయాలని కోరారు. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ మూడేళ్లకు మించి టీటీడీలోకొనసాగించకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈనెల 28న జరిగే బోర్డు సమావేశంలోకొన్ని సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. దశల వారీగా తక్కిన సమస్యలపకై కూడా తగు నిర్ణయం తీసుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీటీడీలోని 20 విభాగాలకు సంబంధించిన వివిధ రకాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.