ఆంధ్రప్రదేశ్‌

డాక్టర్ శిల్ప మృతి కారకులను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: చిత్తూరు జిల్లాలో డాక్టర్ శిల్పను వేధింపులకు గురిచేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు విచారణలో పారదర్శకంగా వ్యవహరించాలని, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. శిల్ప ఫిర్యాదుపై విచారణ కమిటీ నివేదిక ఇంతవరకు బయటకు రాకపోవడం వెనుక అధికార పార్టీ పెద్దల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిజానిజాలను వెల్లడించాల్సిన అవసరం ఉన్నదన్నారు. విచారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి, మహిళల రక్షణకోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్స్ సమర్థవంతంగా పని చేసేలా చూడాలన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని డాక్టర్ శిల్ప కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను సత్వరం శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని మధు కోరారు.