ఆంధ్రప్రదేశ్‌

ఎట్టకేలకు ‘రెరా’ పాలకవర్గం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వ్యవహరాలను నియంత్రించే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు పాలకవర్గాన్ని ఎట్టకేలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెరాకు చైర్మన్‌గా వి.రామ్‌నాథ్‌ను, సభ్యులుగా డాక్టర్ ముళ్లపూడి రేణుక, చందు సాంబశివరావు, శిస్టా విశ్వనాథ్‌లను నియమించింది. రాష్ట్ర విభజన తరువాత ఈ రంగంలో అనుభవం కలిగిన నిపుణులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా రామనాథ్‌తో సీఎం చర్చలు జరిపారు. ఆయన పనితీరు నచ్చి ఏపీటిడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్‌గా నియమించారు. పట్టణ గృహ నిర్మాణంలో సాంకేతిక మార్పులు తీసుకురావడంతో ఈయన కీలక పాత్ర వహించారు. 2016 మే తరువాత నిర్మిస్తున్న అపార్టుమెంట్లు, అభివృద్ధి చేసిన లే అవుట్లు రెరా పరిధిలోకి వస్తాయి.