ఆంధ్రప్రదేశ్‌

మీరా.. వంచనపై గర్జన నిర్వహించేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్ర ప్రజలను నిలువునా వంచించిన వైఎస్ జగన్మోహనరెడ్డి తన అనుచరులతో కలసి నల్లచొక్కాలు ధరించి వంచనపై గర్జన పేరిట సభ నిర్వహించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. ఆర్టీసీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఎంతో మాట్లాడుతూ వైఎస్ హయాంలో జరిగిన అవినీతిపై తాను రూపొందించిన 77 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని విడుదల చేశారు. ఇందులో మొదటి పేజీలోని 10 ప్రశ్నలకు కూడా జగన్ సమాధానం చెప్పలేరంటూ ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి కేసులన్నీ త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయన్నారు. తాజాగా ఈడీ కేసులో ఆయన భార్య భారతిని నిందితురాలిగా చేర్చారన్నారు. అలాగే సీబీఐ జగన్‌పై చార్జిషీటు దాఖలు చేసిన 11 కేసుల్లోనూ భారతితో పాటు బ్రదర్ అనిల్‌కుమార్ పేరును కూడా చేర్చాలన్నారు. తొలుత అనిల్‌శాస్ర్తీగా హైదరాబాద్ వివేకానంద కాలనీలో కేవలం రెండు గదుల అద్దె ఇంట్లో ఉండి వైఎస్ అల్లునిగా రూపాంతరం చెందిన తరువాత అనిల్‌కుమార్ ఏకంగా 11 కంపెనీల్లో డైరక్టర్ ఎలా అయ్యాడో చెప్పాలన్నారు. అయితే మురసిల్లి అనిల్‌శాస్ర్తీ వ్యక్తిగత విషయాల జోలికి తాను వెళ్లబోను కానీ, ఓ మత బోధకునిగా ఉన్నఫళంగా అన్ని ఆస్తులు ఎలా కూడగట్టకల్గారని ప్రశ్నించారు. ఓ వేళ విదేశాల నుంచి మత ప్రచారానికి వచ్చిన నిధులను దారి మళ్లించారా... లేక మామ అవినీతిలో భాగస్వామిగా మారాడా అని రామయ్య ప్రశ్నించారు. 2003లో దివంగత వైఎస్ స్వయంగా తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ నాటి సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది నిజం కాదాఅని ప్రశ్నించారు. అయితే అదే వైఎస్ సీఎం అయ్యాక ఆస్తులు పలురెట్లు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుతం బ్రదర్ అనిల్‌కుమార్‌ను జగన్ తన వద్దనున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు వాడుకుంటున్నారని అన్నారు. ధైర్యం ఉంటే దీనికి జగన్ కానీ, అనిల్ కానీ సమాధానం చెప్పాలన్నారు. ఇక టీటీడీ చైర్మన్‌గా నాడు శ్రీవారి సొమ్మును నొక్కేసిన భూమన కరుణాకరరెడ్డి ఇతరుల అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జగన్ కళంకిత చరిత్ర ప్రజలందరికీ తెలుసుని అన్నారు. 11 కేసుల్లో జగన్‌కు శిక్ష పడకుండా ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షులు అమిత్‌షా కాదు కదా ఈ దేశంలో ఎవరూ ఆపలేరని రామయ్య చెప్పారు. ఇడుపులపాయలో 30 ఏళ్లుగా జగన్ కుటుంబం అనుభవిస్తున్న దళిత వర్గాలకు చెందిన 700 ఎకరాలను తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ ఎందుకు స్వాధీనం చేయలేదని రామయ్య ప్రశ్నించారు. భారతదేశంలోనే ఐఏఎస్ టాపర్‌గా గోల్డ్‌మెడల్ పొందిన శ్రీలక్ష్మి అనే అధికారిణి ప్రస్తుతం ఎదుర్కొంటున్న దయనీయస్థితికి వీరి అవినీతి ఆరాటం కారణం కాదాఅని ప్రశ్నించారు.
వైఎస్ అవినీతి పాత్రలో 108మంది పారిశ్రామికవేత్తలు, అధికారులు నేడు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నది నిజం కాదా అన్నారు. పైసాకూడా పెట్టుబడి లేకుండా భారతి సిమెంట్స్ కంపెనీని స్థాపించి సున్నపురాయి, నీరు, భూమి, ఆర్థిక రుణం ప్రభుత్వం నుంచి పొంది చివరకు అదే కంపెనీని ఆరువేల కోట్లకు అమ్ముకోటం నిజం కాదా అన్నారు. ఈ విధంగా తాను సంధించిన 77 ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడే జగన్‌కు ఇతరులలో తప్పులు వెదికే అర్హత వస్తుందన్నారు. ముందు తనకంటిలోని దూలాన్ని తొలగించుకుంటే... తరువాత ఎదుటివారి కంటిలో నలుసు తొలగించవచ్చునని రామయ్య హితవు పలికారు.