ఆంధ్రప్రదేశ్‌

త్యాగధనుల నుంచి ప్రేరణ పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 10: భారత దేశ స్వతంత్రం కోసం పోరాడిన నేతల నుంచి, దేశ పునర్నిర్మాణానికి త్యాగాలకు పాల్పడిన మహనీయుల నుంచి నేటి యువతరం ప్రేరణ పొందాలి. మహనీయులు వాడిన వస్తువులను ప్రదర్శనశాలలో ఉంచడం ద్వారా మనం వారి స్ఫూర్తి పొందలేం. వారి ఆలోచనలు, మనోభావాలను, త్యాగాలను అర్థం చేసుకున్నప్పుడే, నిజమైన దేశ భక్తులుగా ఎదగగలుగుతామని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఎండాడలో కొత్తగా నిర్మించిన అఖిల భారత్ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యాలయ భవనాన్ని భగవత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంసృతి, సంప్రదాయాలను నేటి యువతరం పూర్తిగా అలవరుచుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. దేశ ప్రజలను జాగృత పరిచేందుకు చేపట్టిన అనేక ఉద్యమాల్లో ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఉద్యమాల్లో ప్రాణార్పణ చేసిన వారిని ప్రేరణగా తీసుకుని, జాతి సముద్ధరణకు విద్యార్థి లోకం పునరంకితం కావాలని అన్నారు. విద్యార్ధులను సద్గుణ సంపన్నులు కావాలి. దేశం కోసమే తమ జీవితం అంకితమన్న భావన ఏబీవీపీకి చెందిన ప్రతి విద్యార్థిలోనూ ఉంటుందని భగవత్ చెప్పారు. దేశ పునర్నిర్మాణం కేవలం ఒక వర్గంతో సాధ్యం కాదని, అందరూ చేయి చేయి కలిపితేనే అది సాధ్యపడుతుందని అన్నారు. దేశ భక్తిని ప్రతి ఒక్కరిలోనూ రగల్చాలి. ఆత్మీయత పంచిపెట్టడంతోపాటు, యువతలో అహంకారాన్ని దూరం చేసి, ఐక్యతా భావం పెంపొందేలా ఏబీవీపీ విద్యార్థులు కృషి చేయాలని భగవత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్, ఏబీవీపీ నాయకులు లక్ష్మణ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..విశాఖలో కొత్తగా నిర్మించిన ఏబీవీపీ భవనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి
ప్రారంభిస్తున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్