ఆంధ్రప్రదేశ్‌

నత్తనడకన ఆక్వా జోన్ల నిర్ధారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 11: సారవంతమైన పంట భూములను ఆక్వా, చేపల చెరువులుగా మార్చకుండా, సుస్థిరమైన ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్దేశించిన ఆక్వా జోన్ల ఏర్పాటు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా సాగులో అగ్ర భాగాన ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఆక్వా జోన్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే ఈ జోన్ల ఏర్పాటుకు ప్రతిపాదించి ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు నిర్ధారణ కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నత్తనడక ప్రక్రియపై నిబంధనల ప్రకారం ఆక్వా సాగుచేసుకుంటున్న రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలు సహా దాదాపు అన్ని చోట్లా భారీ స్థాయిలో ఆక్వా సాగు జరుగుతోంది. మరోవైపు చట్ట విరుద్ధంగానూ జిల్లాలో ఆక్వా, చేపల చెరువులను నిర్వహిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అక్రమార్కులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటంతో అనేక ఏళ్లుగా అనధికార చెరువులను నిర్వహిస్తున్నారు. అనుమతి లేని చెరువులను ధ్వంసం చేస్తామని, అక్రమ సాగుదార్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తరచూ హెచ్చరిస్తున్నప్పటికీ అనధికార ఆక్వా సాగు జరుగుతూనే ఉంది. ఈనేపథ్యంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాలను ఆక్వా జోన్లుగా గుర్తించేందుకు రెండేళ్ల క్రితమే ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. గ్రామసభల్లో ఆమోదం పొందిన పిమ్మట ఆక్వాజోన్లకు అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తూర్పు గోదావరి జిల్లాలోని 398 గ్రామాల్లో ఇప్పటివరకు గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాలో ఆక్వా సాగులో ఉన్న 19,171 హెక్టార్లతో పాటు ఆక్వా సాగుకు అనుకూలంగా ఉన్న 8616హెక్టార్టలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. గుర్తించిన ఈ విస్తీర్ణాన్ని ఆక్వా జోన్లుగా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఆక్వా చెరువుల తవ్వకాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటికి గ్రామసభల్లో ఆమోదం లభిస్తేనే ఆక్వా జోన్లలో చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామసభల్లో అనుమతి పొందని చెరువుల ప్రతిపాదనలను తిరస్కరించాలని స్పష్టం చేసింది. ఆయా గ్రామాల పరిధిలో నిర్వహించిన గ్రామసభల్లో ఆక్వా జోన్ల పెరుగుదలపై విముఖత వ్యక్తం చేసిన పక్షంలో ఆ విధమైన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోరాదని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలావుంటే ఆక్వా జోన్ల ప్రకటన తీవ్ర కాలయాపన జరుగుతుండగా, ఇంకోవైపు జిల్లాలోని తీర ప్రాంతంలో అక్రమ ఆక్వా, చేపల చెరువుల సాగు అప్రతిహతంగా సాగుతోంది. జనావాసాల మధ్య, అనధికారికంగా రాత్రికి రాత్రి ఏర్పాటవుతున్న ఆక్వా చెరువులపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ చెరువుల తవ్వకాలు, సాగుపై తరచూ ప్రజాందోళన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనేక గ్రామాల ప్రజలు ఆక్వా సాగు కారణంగా కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.