ఆంధ్రప్రదేశ్‌

ప్రజల వద్దకు మోదీ వైఫల్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 11: మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి తెచ్చి తృతీయ ప్రత్యామ్నాయమే లక్ష్యంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యం కావాలని, మోదీ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే కార్యాచరణగా పని చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ డి రాజా పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యం చేసి మోదీని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. కేంద్ర స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టి, రాష్ట్రంలో ఆయా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించుకుని బీజేపీని ఓడించడమే వామపక్ష ప్రజాతంత్ర శక్తుల రాజకీయ తంత్రమన్నారు. రెండురోజుల పాటు రాజమండ్రిలో నిర్వహించనున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలను జాతీయ కార్యదర్శి రాజా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన నిర్వహంచిన రాష్ట్ర సమితి సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ రాజా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్ అజెండాతో పని చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ హోల్‌మార్కుతో పని చేస్తుందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు ఒకే సారి జరగాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, మోదీ ప్రతిపాదనను ప్రధాన పార్టీలన్నీ వ్యతిరేకించాయన్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ ఆయా సామాజిక పరిస్థితులకు అనుగుణమైన సమస్యలు ఉన్నాయని, వాటిని ఏ రాష్ట్రానికి ఆ రాష్టమ్రే అన్నట్టుగా చూడాలన్నారు. ప్రస్తుతం దేశం బీజేపీ పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, అందులో మూడు ప్రధాన సమస్యలతో సతమతమవుతోందన్నారు. సామాజికాంశాలపై అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, ప్రజాస్వామ్య వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసి కార్పొరేట్‌కు దాసోహం అన్నట్టుగా పని చేస్తోందన్నారు. దేశంలో అసమానతలను పెంచిపోషిస్తోందని, 70 శాతం సంపద, ఒక శాతం ధనికవర్గం చేతుల్లో పెడుతోందని, మోదీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ తిరోగమనంలో పయనిస్తోందన్నారు. గతంలో ఏ ప్రధానికి ఎదురుకాని విధంగా మోదీ చేసిన ప్రసంగాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించడం దేశాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. మోదీ ఆడంబరానికి పోయి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారన్నారు. ప్రస్తుతం దేశం మోదీ పాలనలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మూకుమ్మడి దాడులకు గురవుతోందన్నారు. దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. ప్రధానులు మారినప్పటికీ ముందు పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన వాగ్ధానాలను, హామీలను ఏ ప్రధాని వచ్చినా అమలు చేయాల్సిందేనని, మోదీ మాత్రం గత ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ప్రజాస్వామ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేనన్నారు. ఏపీ విభజనలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం మోదీ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందన్నారు.
చిత్రం..సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో మాట్లాడుతున్న పార్టీ జాతీయ కార్యదర్శి రాజా