ఆంధ్రప్రదేశ్‌

నిద్రలేమితో ఆరోగ్యానికి హాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 11: మానవుల్లో నిద్రలేమి జీవప్రక్రియను దెబ్బతీస్తూ జన్యువులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని నోబెల్ బహుమతి గ్రహీత, న్యూయార్క్ రాక్‌ఫెల్లర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మైఖేల్ డబ్ల్యూ యంగ్ అన్నారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశాఖలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలపై పరిశోధనలతో ప్రారంభమైన తన అధ్యయనాలు సుదీర్ఘ కాలం పాటు సాగి వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మానవాళిపై సాగుతూ వచ్చిందన్నారు. జనాభాలో అత్యధికం డిలేడ్ స్లీప్ ఫేజ్ డిజార్డర్ (డీఎస్‌పీడీ) సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. అమెరికాలో ఐదు శాతం జనాభాలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని, యూరోపియన్లలో ప్రతి 75 మందిలో ఒకరు ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారన్నారు. నిద్ర లేమి ఒక సమస్యగా గుర్తించినప్పటికీ జన్యువులతో గల సంబంధాన్ని గుర్తించేందుకు సుదీర్ఘకాలం పట్టిందన్నారు. నిద్రలేమికి శరీరంలోని వివిధ భాగాల జీవన ప్రక్రియకు కూడా సంబంధం ఉందని, దీనిని లోతుగా అనే్వషించగలిగితే వివిధ అనారోగ్య సమస్యలకు కారణాలు లభిస్తాయన్నారు. గీతం అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి నోబెల్ బహుమతి గ్రహీతకు గీతం ఫౌండేషన్ అవార్డు-2018తో పాటు రూ.10 లక్షల నగదు అందజేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ మైఖేల్ యంగ్ వంటి యువ శాస్తవ్రేత్తల నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. మానవాళి మనుగడకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలన్నారు. అంతకు ముందు గీతం వర్శిటీలో అత్యుత్తమ సేవలందించిన బోధన, బోధనేతర సిబ్బందికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో గీతం ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు, వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు, గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెస్‌ర్ కే గంగాధర రావు, గీతం విశ్వవిద్యాలయం ప్రో వైస్ ఛాన్స్‌లర్ కే శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ఎం పోతరాజు, విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మైఖేల్ డబ్ల్యూ యంగ్ దంపతులను సత్కరిస్తున్న గీతం
విద్యా సంస్థల చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి, చాన్స్‌లర్ కోనేరు కృష్ణారావు