ఆంధ్రప్రదేశ్‌

లోయలో పడ్డ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బూర్గంపహాడ్, భద్రాచలం రూరల్, ఆగస్టు 11: ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది.్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు వంతెన వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయలయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భద్రాచలం నుంచి విజయవాడకు శనివారం ఉదయం బయలుదేరింది. ఉదయం 9 గంటల సమయంలో బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక గ్రామాల మధ్య పెద్ద వాగు బ్రిడ్జికి సమీపంలోకి బస్సు రాగానే బురదమయంగా ఉన్న రహదారి పక్కకు బస్సు అదుపు తప్పి దూసుకెళ్లింది. డ్రైవర్ బస్సును ఆపేలోగా బస్సు 20 అడుగులకు పైగా లోతు ఉన్న బ్రిడ్జి కిందకు పడిపోయింది. ఈ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అటుగా వెళ్తున్న స్థానికులు ఈ ప్రమాదం గమనించి వెంటనే బ్రిడ్జి కిందకు వెళ్లి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వాగుకు 15 అడుగుల దూరంలో బస్సు కింద పడిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో బస్సు వాగులో పడక పోవటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు బాధితులకు చికిత్స అందించారు. ఘటన విషయం తెలియగానే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. భద్రాచలం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, జాతీయ కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు విషయం తెలుసుకోని ఆసుపత్రికి తరలివచ్చారు. క్షతగాత్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై వారు ఆరా తీశారు. బాధితులకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.