ఆంధ్రప్రదేశ్‌

చార్జిషీట్ల దాఖలు వాస్తవం కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 11: ఈడీ కేసు విషయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వాదన విచిత్రంగా ఉందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ విషయమై జగన్ బహిరంగలేఖకు యనమల శనివారం ఒక ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు. ఈ కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందోలేదో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ లేఖ ద్వారా ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనేది తేటతెల్లమైందన్నారు. ఈడీ చార్జిషీట్ అనేది జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిందే అని, దాంతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈడీ చార్జిషీట్ దాఖలయినట్టు పత్రికల్లో, మీడియాలో వచ్చిన దానికి టీడీపీని నిందించటం సమంజసం కాదన్నారు. ఈడీ కేసు ద్వారా జగన్ సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈడీ కేసులలో తన భార్యకు సంబంధంలేదని జగన్ ఎక్కడా పేర్కొనలేదన్నారు. అవినీతికి పాల్పడలేదని చెప్పుకోలేని ఆయన పత్రికల్లో వార్తలకు అభ్యంతరం ఎలా చెప్తారని ప్రశ్నించారు. జగన్ వైఖరితో కుటుంబసభ్యులు ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. కేసులో తన పేరు ఉండటాన్ని ఎక్కడా ఖండించలేదని, స్వయాన ఆయన తరుపు న్యాయవాదులే చెప్తున్నారని గుర్తుచేశారు. ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ ఆస్తిని క్విడ్‌ప్రోకో ద్వారా జగన్ కంపెనీలకు మళ్లించారనే దానిపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాయని తెలిపారు. ఈ విషయంలో తమ పార్టీ చేసిన ఆరోపణలు రుజవవుతున్నాయని చెప్పారు. జగన్‌కు సంబంధించిన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది వాస్తవంకాదా? 11 చార్జిషీట్లు దాఖలైన మాట నిజం కాదా అని నిలదీశారు. జగన్‌తో పాటు ఆయన భార్య భారతిపై వచ్చిన ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తునిలో అభివృద్ధి
జరగలేదనటం అవాస్తవం
తన సొంత నియోజకవర్గం తునిలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని జగన్ ఆరోపణలు పచ్చి అబద్ధాలని యనమల మండిపడ్డారు. గత నాలుగేళ్లలో రూ 1082 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. తుని నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇంత పెద్ద అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదన్నారు పుష్కర ఎత్తిపోతల పనులు ప్రారంభించి పూర్తిచేస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు. రూ 14 వందల కోట్లతో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రారంభించారని, గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తామని తెలిపారు. రూ 1650 కోట్లతో పోలవరం ఎడమ కాల్వ పనులు జరుగుతున్నాయని అందులో భాగంగానే తాండవ నదిపై అక్విడెక్ట్ నిర్మించి అక్కడి నుంచి ఇచ్ఛాపురానికి నీటిని అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. పోలవరం నిర్మాణంలో పదేళ్ల జాప్యం కారణంగానే అంచనాలు పెరిగాయన్నారు. వైఎస్ హయాంలో కమీషన్ల కోసమే కాల్వలు తవ్వారని ఆరోపించారు. వైఎస్ కుటుంబం అంటేనే మొబలైజేషన్ అడ్వాన్స్‌లు, కమీషన్ల కుటుంబమని ఎద్దేవా చేశారు. తునిలో అల్లర్లు జగన్ పుణ్యమే అన్నారు. కాకినాడ సెజ్‌లో పదివేల ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీ అడ్డుకుందన్నారు. నాయకులు ఎలా ఉండాలో చార్జిషీట్లతో జైలుకు వెళ్లిన జగన్ చెప్పడం మిలీనియం జోక్ అని విమర్శించారు. కాపుల రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ చట్టం, ప్రత్యేక హోదా అంశాలపై జగన్ తునిలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించి అధికారంలోకి రావాలనే కుతంత్రాలు సాగవన్నారు.