ఆంధ్రప్రదేశ్‌

కాపులపై ముద్రగడ వైఖరి స్పష్టం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, ఆగస్టు 12: ఉద్యమ నేతగా పేరొందిన ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంపై యూటర్ను ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం డి పోలవరం ప్రజా సంకల్పయాత్ర విశ్రాంతి శిబిరం వద్ద ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కాపు జాతి కోసం అనేక విధాలుగా పోరాటాలు చేసిన ముద్రగడ ఇప్పడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జగ్గంపేట పాదయాత్రలో జగన్ చెప్పిన మాటే మరుసటి రోజు ఆర్థిక మంత్రి యనమల కాపు రిజర్వేషన్లు, సుప్రీంకోర్టు అంశాన్ని ప్రస్తావించారని, యనమల మాటపై ఎమీ మాట్లాడని ఉద్యమనేత జగన్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నారు. తుని ఘటనలో అనేక మందిపై కేసలు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వాన్ని నిలదీయడం మానివేపి ప్రతిపక్షంగా సహకారం అందించే తమపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ముద్రగడ వైఖరి వల్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన కాపు సోదరులు ఇప్పుడు అయోమయంలో పడిపోయారని ఉమ్మారెడ్డి అన్నారు. కాపులకు మొదటి నుండి జగన్ అండగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, అనంత ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.