ఆంధ్రప్రదేశ్‌

ఏం సాధించారు? ఎవరిది పైచేయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పైచేయి ఏ పార్టీదనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. గత నెల 18 నుంచి ఈనెల 10వ తేదీ వరకు మొత్తంగా 18రోజులు జరిగిన ఈ సమావేశాల్లో ఎవరి బలమెంత అనే అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభ వేదికగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మిత్రపక్షాల కూటమి ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సమావేశాలను రక్తి కట్టించాయి. ఇంతకుముందెన్నడూ లేని రీతిలో తొలిఘట్టం అవిశ్వాస ప్రకటన నుంచి చివరి ఘట్టమైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సమావేశాలు దేశప్రజల దృష్టిని ఆకర్షించాయి. అన్నింటికీ మించి కొద్దినెలల క్రితం వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాసం ఎక్కుపెట్టటం ప్రాంతీయ పార్టీల్లో ఓ ఊపు తెచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలు, నిధుల మంజూరులో కేంద్రం తీరని ద్రోహం చేస్తోందనేది ఏపీ సర్కార్ వాదన. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా ప్రజల్లో బలంగా వేళ్లూనుకోవటంతో రాష్ట్రంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్ష, జనసేన పార్టీలు ఉద్యమబాట పట్టాయి. ఇందులో భాగంగానే ఇంతకుముందు పార్లమెంటు సమావేశాల్లోనే టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. అయితే అప్పట్లో బీజేపీ కనుసన్నల్లో ఏఐఏడీఎంకె, టీఆర్‌ఎస్ సభ్యులు సభలో ఆందోళనలు నిర్వహిస్తున్నందున అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆస్కారం లేదంటూ స్పీకర్ దాటవేయటంతో సమావేశాలు ముగిశాయి. కాగా తాజా సమావేశాల్లో హోదా, విభజన చట్టం అంశాల అమలుపై మరోసారి అవిశ్వాసానికి టీడీపీ నోటీసిచ్చింది. ఎట్టకేలకు దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించటంతో దేశం యావత్తు అవిశ్వాసంపై దృష్టి కేంద్రీకరించింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన అధికార టీడీపీపై ముప్పేట దాడి కొనసాగిస్తుండటం టీడీపీకి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. దీంతో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు అవిశ్వాసం ప్రకటించింది. కాగా హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తమ పార్టీ లోక్‌సభ సభ్యులచే రాజీనామా చేయించిన వైసీపీకి అవిశ్వాసంపై చర్చించే అవకాశం కోల్పోవటంతో పాటు లోక్‌సభ ఎదుట ఆందోళన చేసే వీల్లేకుండా పోయింది. ఇదంతా కేంద్రంతో లాలూచీ ఒప్పందం కారణంగానే జరిగిందనే బలమైన ప్రచారం చేసుకోవటంలో తెలుగుదేశం పార్టీ సఫలీకృతమైంది. హోదాపై అవిశ్వాసానికి పార్టీలు సిద్ధమైతే కేంద్రంలో ఇతర పార్టీల మద్దతు తాను కూడగడతానని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సైతం యూటర్న్ తీసుకున్నారనే ప్రచారాన్ని కూడా తెరపైకి తెచ్చింది. మొత్తంగా టీడీపీ ప్రకటించిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించటం ఓటింగ్‌లో ఎన్డీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్ష, ఇతర పలు ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావటంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించిందని చెబుతున్నారు. సమావేశాలకు హాజరుకానని భీష్మించుకున్న జేసీ దివాకర్‌రెడ్డిని బుజ్జగించటంతో పాటు ప్రతిరోజు ఎంపీలతో జరిగిన పరిణామాలపై చర్చించి భవిష్యత్ వ్యూహాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నిర్దేశించటం వల్లే కేంద్రాన్ని ఇరుకున పెట్టగలిగామనే భావన టీడీపీ ఎంపీల్లో వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా లోక్‌సభ వెలుపల ఎంపీలు సీరియస్‌గా చేపట్టిన ఆందోళన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కారణంగా ఒకింత పక్కదారి పట్టిందనే విమర్శలు ఆ పార్టీశ్రేణుల్లోనే వినవస్తున్నాయి. విచిత్ర వేషధారణల వల్ల సీరియస్‌నెస్‌కు విఘాతం కలుగుతుంది కదా అని ఆ పార్టీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించటం గమనార్హం. ఓ ప్రాంతీయ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించటం, దానిపై ఓటింగ్ నిర్వహించటం దేశ పార్లమెంటు చరిత్రలోనే అరుదైన ఘట్టమనే రికార్డు టీడీపీకి దక్కింది. టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో నిత్యం టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా చంద్రబాబు దిశానిర్దేశం చేయటంతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, తదితర పార్టీ నేతలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ఢిల్లీలో మకాం వేయించటం ద్వారా ఎంపీలతో సమన్వయం సజావుగా సాగింది. ఓటింగ్‌లో బీజేపీ విజయం సాధించినప్పటికీ ప్రాంతీయ పార్టీల అవసరాన్ని గుర్తించే వీలు కలిగిందని చెప్తున్నారు. కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో ‘జమిలి’ ఎన్నికలకు సన్నాహాలు చేయటం దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకునేందుకు బీజేపీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పునస్సమీక్షించుకునే పరిస్థితికి దారితీసిందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంశాలు, నాడు రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వాగ్దానాలు, అనంతరం బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించింది. గత నాలుగేళ్లుగా ఏపీకి జరుగుతున్న అన్యాయం, మంజూరు కావాల్సిన నిధులు, ఏర్పాటు కావాల్సిన జాతీయ సంస్థలు, షెడ్యూల్ 9, 10 ప్రకారం ఆస్తుల పంపకాలు, తదితర అంశాలన్నింటికీ కేంద్రం పక్కనపెట్టి సాధ్యాసాధ్యాలను వివరిస్తూ సుప్రీం కోర్టుకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అంతేకాదు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలను బీజేపీ పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఓవైపు రాజకీయంగా, మరోవైపు నిధుల కేటాయింపులో వివక్షను ప్రదర్శించటంతో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీడీపీ సన్నద్ధమైంది. ఇదే తరహాలో సమావేశాల ముగింపు సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు ఏకమవుతాయని భావించినప్పటికీ చివరి క్షణంలో కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలో దించటంతో వ్యూహం బెడిసికొట్టింది. అదే ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థిని రంగంలో దించి ఉంటే హోరాహోరీ పోరు సాగేదనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. పీఏసీ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు 110 ఓట్లు రావటంతో పాటు స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ తమకు మద్దతివ్వాల్సిందిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తదితర నేతలకు ఫోన్ చేయటం విశేషం. కేవలం రాజ్యసభలో ఏడుగురు, లోక్‌సభలో 15మంది సభ్యుల బలం కలిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా బరిలో దిగిన సీఎం రమేష్‌కు 110 ఓట్లు రావటం గమనార్హం. రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నికల్లో ఆఖరి క్షణంలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలపకపోతే ప్రాంతీయ పార్టీల హవా కొనసాగేదనే విశే్లషణలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో సైతం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు తటస్థంగా ఉండటం బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాలకు మరింత ఊతమిస్తోందనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.