ఆంధ్రప్రదేశ్‌

ఆదివాసీ, అటవీ హక్కులు హరించే చట్టం మనకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 12: ఆదివాసీ అటవీ హక్కులు హరించే జాతీయ అటవీ విధాన ముసాయిదాను వ్యతిరేకించాలని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్(ఏఏఆర్‌ఎం) జాతీయ కన్వీనర్, త్రిపుల లోక్‌సభ సభ్యుడు జితేంద్ర చౌదరి పిలుపునిచ్చారు. జాతీయ అటవీ ముసాయిదా-2018పై విశాఖ ఏయూ టీఎల్‌ఎన్ సభాహాలులో ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అడవులను సైతం ప్రైవేటీకరించేందుకే కేంద్రం ఈ ముసాయిదా చట్టాన్ని తీసుకువస్తోందని మండిపడ్డారు. అటవీ ప్రాంతంలో ఉండే విలువైన ఖనిజాలు దోచుకునేందుకు అడ్డుగా ఉన్న అటవీ హక్కుల చట్టాన్ని తూట్లు పొడిచేందుకేనన్నారు. కాంపెనే్సటరీ ఫారెస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ జాతీయ అటవీ విధానం మరియు ప్లానింగ్ అథారిటీతో రుద్దబడిన అన్యాయపూరితమైన కార్పొరేట్ అనుకూల విధానం కొనసాగింపే నూతన ముసాయిదా ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకూ ఉన్న గిరిజన హక్కులను పక్కకు నెట్టేస్తూ సంప్రదాయ గ్రామసభలను నిర్లక్ష్యం చేస్తూ అడవులపై గిరిజనులకు హక్కుల్లేకుండా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం ఆంగ్లేయులు అడవులను దోచుకునే దురాక్రమణ దారులుగా గిరిజనులను చూసినట్టే, నూతన అటవీ ముసాయిదాలో పేర్కొంటున్నారన్నారు. ఆదివాసీ అనుకూల చట్టాల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పర్యావరణానికి అనువైన చెట్ల జాతుల పెంపకం జరిగాలని, కానీ వ్యాపార ప్రయోజనాల కోసం చట్టాలను రూపొందించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సులువుగా వ్యాపారం పేరిట పర్యావరణ పరిమితులకు తిలోదకాలు ఇచ్చేందుకు కేంద్రం వెనుకాడట్లేదన్నారు. గనులు, ఖనిజాల క్రమబద్ధీకరణ సరళీకృత చట్టానికి వరుస సవరణల ద్వారా బాక్సైట్ వంటి ఖనిజ సంపదకు నిలయమైన అడవులు, పర్వత శ్రేణుల్లో గనుల తవ్వకానికి ఈ ముసాయిదా చట్టం తలుపులు బార్లా తెరుస్తుందన్నారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ అటవీ విధానం ముసాయిదాపై గ్రామసభల్లో విస్తృత చర్చ జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కు, అటవీ భూమి, సంపదపై గిరిజన తెగలకున్న హక్కులు రద్దు చేస్తూ, గ్రామసభల హక్కులు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు చేస్తున్న ఈ దురాగతాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

చిత్రం..సదస్సులో ప్రసంగిస్తున్న ఆదివాసీ అధికార్ రాష్ట్రీ మంచ్ కన్వీనర్ జితేంద్ర చౌదరి