ఆంధ్రప్రదేశ్‌

సెల్ఫ్‌గోల్స్‌తోనే జగన్ ఇమేజ్ డ్యామేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 12: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి వరుస సెల్ఫ్‌గోల్స్ తన ఇమేజ్‌ను తానే డ్యామేజ్ చేసుకుంటూ పార్టీ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆదివారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభకు గైర్హాజరు కావడం ద్వారా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చను పరోక్షంగా అడ్డుకోవడం, కాపు రిజర్వేషన్లపై కప్పదాటు వైఖరి, దేశంలోనే అత్యంత సీనియర్ ప్రజాప్రతినిధి, పరిపాలనాదక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కాల్చిచంపాలి, ఉరితీయాలంటూ ఆవేశపూరిత, అనాలోచిత ప్రసంగాలు జగన్మోహనరెడ్డి నైజాన్ని తెలియజేస్తున్నాయన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ అవినీతి కేసులో సతీమణి భారతిని నిందితురాలిగా చేరిస్తే అందుకు కూడా చంద్రబాబే కారణమనటం జగన్ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. చివరకు తునిలో రైలును చంద్రబాబే తగలబెట్టించారని చెప్పడం జగన్మోహనరెడ్డి మానసిక స్థితిని తెలియజేస్తోందని ఘాటుగా విమర్శించారు. ఇకనైనా ప్రతిపక్ష నేత హుందాగా, విజ్ఞతగా విమర్శలు చేయాలేతప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మాణిక్యవరప్రసాద్ హితవు పలికారు. విలేఖరుల సమావేశంలో టీడీపీ నేతలు మస్తాన్‌వలీ, హనుమంతరావు, షేక్ జిలానీ పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్