ఆంధ్రప్రదేశ్‌

అజ్ఞాతంలో వైసీపీ నేత కన్నబాబురాజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఆగస్టు 12: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే యువివి కన్నబాబురాజు ఆయన తనయుడు, డిసిసిబి చైర్మన్ సుకుమార వర్మ గడచిన పది రోజులుగా పార్టీ వర్గీయులకు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అవుతోంది. కన్నబాబురాజు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే తనకు అత్యంత సన్నిహితులకు సైతం కనీసం ఫోన్‌లోనైనా కన్నబాబు రాజు ఆయన తనయుడు అందుబాటులోకి దొరక్కపోవడం రాజకీయంగా పెద్ద దుమారానికి తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి యలమంచిలి అసెంబ్లీకి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కన్నబాబురాజు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి కృషిచేశారు. యలమంచిలి, పాయకరావుపేట అసెంబ్లీలో దేశం పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర వహించారు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను చేసిన కృషికి ప్రతిఫలంగా తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కుతుందని కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కకపోగా రానున్న ఎన్నికల్లో అదమం యలమంచిలి అసెంబ్లీ టిక్కెట్ అయినా దక్కుతుందని ఆశించారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ముఖ్యనేతల నుండి ఇందుకు ఇసుమంతైనా సానుకూల స్పందన రాకపోవడంతో గడచిన రెండునెలల క్రితమే హడావుడిగా వైఎస్సాఆర్ సీపీలో చేరిపోయారు. కన్నబాబురాజు పార్టీలో చేరిందే తడవుగా యలమంచిలి అసెంబ్లీలో వైసీపీ విజయానికి ఢోకాలేదనే సంకేతాలు ధృడంగా వ్యక్తమయ్యాయి. రానున్న ఎన్నికల్లో యలమంచిలి అసెంబ్లీ టిక్కెట్ కన్నబాబుకు ఖరారైనట్లేననే సంకేతాన్ని పార్టీశ్రేణులకు, ప్రజలకు అధినేత జగన్ స్పష్టంగానే ఇచ్చారు. ఈ నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగానే వైఎస్సాఆర్ పార్టీలోకి తటస్థులను తీసుకురావడంలో కన్నబాబురాజు చాపకింద నీరులా ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. ఈ నెల 14న జిల్లాకు వైఎస్ జగన్ పాదయాత్ర చేరుతున్న సందర్భంలో జిల్లా వ్యాప్తంగా జగన్ పాదయాత్రను దిగ్విజయం చేయడంలో కన్నబాబురాజు ప్రధాన పాత్ర వహిస్తారని భావించారు. యలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లి, మాడుగుల, చోడవరం, పెందుర్తి తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం తటస్థులను, తెలుగుదేశం పార్టీలో ఉన్నవారిని వైసీపీ గూటిలోకి తీసుకువచ్చేందుకు కన్నబాబు తనదైన పంథాలో అత్యంత గోప్యంగా ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. దీంతో జిల్లాలో జరిగే వైఎస్ జగన్ పాదయాత్రతో పార్టీలో పలువురు అధికార దేశం నేతలు, తటస్థ నేతలు చేర్చి మరింత గట్టి బలాన్ని కూడగట్టుకుంటుందని ఆ పార్టీశ్రేణులు ఆశించారు. ఇటువంటి కీలక పరిస్థితుల్లో కన్నబాబురాజు ఆయన తనయుడు సుకుమార వర్మ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. గతంలో తనపై నమోదైన కేసుల్లో తిరిగి తెరపైకి తెచ్చి ఆయనను అరెస్టు చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందనే ప్రచారం సాగుతోంది. ఆ భయంతోనే ముందు జాగ్రత్తగా కన్నబాబురాజు ఆయన తనయుడు సుకుమార వర్మ ఎవరికి దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం సాగుతుంది. ఇదిలాఉండగా జగన్ పాదయాత్ర జిల్లాకు చేరుకుంటున్న సందర్భంలో కన్నబాబురాజు పార్టీకి అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా పాదయాత్రను దిగ్విజయం చేసే బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రధానంగా యలమంచిలి అసెంబ్లీలో జగన్ పాదయాత్రకు ఇన్‌చార్జిగా సూర్యనారాయణ రాజును నియమించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.