ఆంధ్రప్రదేశ్‌

ప్రజలే మేనిఫెస్టో రూపకర్తలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 12: గ్రామాలు, ప్రాంతాల వారీగా ప్రజలే తమ అవసరాలను గుర్తించి మేనిఫెస్టోలు రూపొందించుకోవాలని, వాటిని అమలు చేసేందుకు అంగీకరించే రాజకీయ పార్టీలకే పట్టం కట్టాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. సమైక్య భారతి ఆధ్వర్యంలో ‘రాజకీయాలు-విలువలు’ అంశంపై విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడే ప్రజాస్వామ్యంలో మార్పు సంభవిస్తుందన్నారు. ఇప్పటివరకూ ప్రజల ప్రమేయం లేకుండా, రాజకీయ పక్షాలే ప్రజల అవసరాలను తీరుస్తామంటూ మేనిఫెస్టోలు రూపొందిస్తూ మభ్యపెడుతున్నాయన్నారు. భవిష్యత్‌లో ప్రజలు, గ్రామాలే వారి అవసరాలను సూచిస్తూ మేనిఫెస్టోలు రూపొందించుకుని, తాము ఎన్నుకునే నాయకుడు వాటిని అమలు చేస్తామన్న హామీతోనే గెలిపించుకోవాలని లక్ష్మీనారాయణ పిలుపిచ్చారు.