ఆంధ్రప్రదేశ్‌

పవన్‌పై సీఎం దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 12: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బిజెపితో సంబంధం లేదని, ఆయనకు అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పవన్‌కళ్యాణ్‌కు బిజెపితో సంబంధం లేదు కాబట్టే వామపక్షాలతో కలుస్తున్నారని స్పష్టం శారు. బిజెపితో కలిసేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదన్నారు. సోమవారం విజయవాడలో వామపక్షాలు, లోక్‌సత్తా తదితర పార్టీలతో పవన్ భేటీ కానున్నట్లు చెప్పారు. ఈసమావేశంలో ప్రజా అజెండాను రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి అవినీతిని అభివృద్ధి చేశారని ఆరోపించారు. 2014లో ఏపీ అప్పు రూ. 94వేల కోట్లు ఉండగా, నేడు అది 2.44లక్షల కోట్లుకు చేరుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి విమాన ఖర్చులకే రూ.100 కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో హోటళ్లలో బసకు రూ.25 కోట్లు ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. పుష్కరాల తొక్కిసలాట ఘటనపై విచారణ నివేదిక ఏమైందో తెలియడం లేదని, దీనిపై కోర్టు ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 15న విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. హిందూపురం, ఇచ్చాపురం నుంచి రెండు బస్సు యాత్రలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. సిపీఐ రెండు రోజుల రాష్ట్ర సమితి సమావేశాల్లో పలు కీలక తీర్మానాలు ఆమోదించామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సుబాబుల్ కలపకు మద్దతు ధర పెంచాలని, ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ రాజ్యాంగ ప్రతులను దహనం చేసిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ తీర్మానించామన్నారు. అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీలో సమర్థత కోల్పోయాయని, ఈరెండు పార్టీలను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా నిరోధించాలన్నారు. సమావేశంలో సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రావుల వెంకయ్య, తాటిపాక మధు, నల్లా రామారావు, తదితరులు పాల్గొన్నారు.