ఆంధ్రప్రదేశ్‌

మానవతకే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఆగస్టు 12: సమాజంలో ద్విగుణీకృత మార్పులు తీసుకురావాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాక్రిష్ణన్ అభిలషించారు. రాజ్యాంగం విలువలతో మమేకం అవ్వాలన్నారు. అనంతపురం జిల్లాలోని ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆదివారం ‘మానవీయ విలువలతో న్యాయవ్యవస్థ’ అంశంపై జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఇందులో నైతిక విలువలు, న్యాయానుసార ప్రపంచంపై జాతీయ న్యాయ నిపుణులు తమ అభిప్రాయాలను తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాక్రిష్ణన్ భారత రాజ్యాం గం ప్రవేశికలో సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రసంగించారు. అలాగే భగవాన్ సత్యసాయి బాబావారి మానవీయ విలువలపై మాట్లాడారు. న్యాయపరిపాలన, విధానంలో తీర్పు ఇవ్వడంలో మానవత్వానికి పెద్దపీట వేయాలన్నారు. విలువలతో కూడిన న్యాయ విద్యను అందించాలని సూచించారు.
న్యాయవ్యవస్థ సమాజానికి మంచి చేస్తుందన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు అంతర్గత విషయం లో రాజీపడకూడదన్నారు. న్యాయమూర్తులు పాటించాల్సిన అంశాలపై విపులంగా చర్చించారు. ఇక రాష్ట్ర హైకోర్టు జడ్జి రామసుబ్రహ్మణియన్, ఢిల్లీ హైకోర్టు జడ్జి సంగీత, డీగ్రో సెహగల్ హరిశంకర్, మణిపూర్ హైకోర్టు జడ్జి కతీషర్‌సింగ్ ‘నీతి, నియమాలు, న్యాయవాద వృత్తి’ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు సభ్యులు రత్నాకర్, దేశీయ అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జాతీయ న్యాయ నిపుణులను సత్కరిస్తున్న దృశ్యం