ఆంధ్రప్రదేశ్‌

అడ్డంగా దొరికిపోయి.. టీడీపీపై నిందలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 12: అక్రమాస్తుల కేసులో అడ్డంగా దొరికి ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నాల్లో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు ఆక్షేపించారు. ఈడీ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు కుటుంబాన్ని రోడ్డుకీడ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కేంద్రంలో బీజేపీతో చేతులు కలిపి కేసులు మాఫి చేయించుకోవాలనుకున్నారని, రాష్ట్రంలో బీజేపీకి పట్టులేదని తెలిసి మాటమార్చుతున్నారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. జగన్ భార్య భారతి పేరును ఈడీ చార్జిషీట్‌లో చేర్చారనే భయంతోనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా రాజ్యసభ సభ్యుల్ని తప్పించారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో అడ్డంగా దొరికిపోయి ఆ కేసుల్ని టీడీపీ ప్రభుత్వమే విచారణ చేయిస్తోందనే అర్థంలేని వాదనలు వినిపిస్తున్నారని ఖండించారు. ఈడీ చార్జిషీట్లపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు వాస్తవాలను గ్రహించాలన్నారు. జగన్ అక్రమార్జనలో భాగంగా ఏర్పాటైన చాలా సంస్థలకు వైఎస్ భారతి ఎండీగా, వైస్‌చైర్మన్‌గా ఉన్నారని ఆరోపించారు. షేర్ల బదలాయింపు సమయంలో సైతం ఆమె సంతకాలు చేశారని, అందుకే చార్జిషీట్‌లో పేరు నమోదైందని వివరించారు. జగన్ స్వయం కృతాపరాథం వల్లే భారతిపై కేసు నమోదవుతోందని చెప్పారు. జగన్ తన నీడను తానే నమ్మరని, అందువల్లే థర్డ్ పార్టీ వ్యక్తుల పేరుపై ఆస్తులు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ భారతిని భాగస్వామిని చేసి ప్రతిష్ఠను దిగజార్చుకున్నారన్నారు. భారతికి వేతనం ఆయా సంస్థల నుంచి ఇస్తే ఎవరూ ప్రశ్నించరని, ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో ఏర్పాటైన సంస్థలు ఇస్తున్నందునే కేసులు నమోదవుతున్నాయన్నారు. రూపాయి అవినీతికి తావులేకుండా గత పాతికేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు హెరిటేజ్ సంస్థను నిర్వహిస్తున్నారని, అలాంటిది వారికి ప్రతిఫలం ఎందుకు అందకూడదని ప్రశ్నించారు. ప్రజాధనం రూ. 43వేల కోట్లు లూటీచేసిన జగన్‌కు సీఎంను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. స్వయానా వైసీపీ అధికార ప్రతినిధి 12వందల కోట్ల మేర ఆస్తులకు సంబంధించి విచారణ జరుగుతోందని చెప్పటం సిగ్గుచేటన్నారు. ఆ సొమ్ము ఎక్కడిదో తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతిపరుడు కాదంటున్న వైసీపీ నేతలు బెంగళూరులో ప్యాలెస్, లోటస్‌పాండ్, పులివెందులలో ఆస్తులెలా సంపాదించారో ప్రజలకు వివరించాలన్నారు.