ఆంధ్రప్రదేశ్‌

అధికార దాహంతోనే అసత్య ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, ఆగస్టు 12: అధికార దాహంతో వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్ చాంబర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు గర్జన సందర్భంగా తునిలో రైలు దహనం చేయించింది సీఎం చంద్రబాబేనని, భారతీరెడ్డిపై ఈడీ కేసులు తమ ప్రభుత్వం పెట్టిస్తోందని జగన్ ఆరోపించడం దారుణమన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడి పలు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఈ కేసులను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు తెంచుకుని తమ ప్రభుత్వం పనిచేస్తుండగా, కేంద్రంతో కలిసి భారతీపై కేసులకు తాము పురిగొల్పుతున్నట్లు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో లక్షల కోట్లు అవినీతికి పాల్పడిన కేసుల్లో ఇరుక్కున్న జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఆయన సతీమణి అయినందున భారతిపై కూడా 11 కేసులు ఈడీ నమోదు చేసిందనే విషయం మరచిపోరానన్నారు.
తుని యాత్రలో నిజాయితీపరుడైన ఆర్థిక మంత్రి యనమలపై విమర్శలు చేయడం దారుణం అన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశపై అయిదు శాతం ప్రాధాన్యత కల్పించాలని కేంద్రాన్ని కోరడంతోపాటు కార్పొరేషన్ ద్వారా తం వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారని చినరాజప్ప కొనియాడారు. కాపులను అన్ని విధాల అదుకునేది ఒక్క తెలుగుదేశం మాత్రమేనన్నారు. జగన్ తన పాదయాత్రలో అధికార దాహంతో ఇస్తున్న హమీలకు బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవాచేశారు. తూర్పు గోదావరి జిల్లా నుండే జగన్ పతనం ప్రారంభమైందని మంత్రి రాజప్ప విమర్శించారు. జిల్లాలో పాదయాత్రకు అతి తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని, తునిలో పాదయాత్రకు అసలు జనం రాలేదన్నారు. జగన్ ప్రతిష్ఠను తునిలో వ్యాఖ్యలతో పూర్తిగా పొగొట్టుకున్నారన్నారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో తమ అధినేత చంద్రబాబు మద్దతుగా మాట్లాడితే తప్పుబట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు కాపుల రిజర్వేషన్‌ల కోసం ఏలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ, జనసేనలకు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు స్వాగతం పలుకుతున్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు.