ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ తీర్మానం అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), ఆగస్టు 20: కాపులు, బలిజలను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతో అభినందనీయమని కాపు ఫెడరేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినందుకు సీఎం చంద్రబాబు నాయుడుని ప్రత్యేకంగా సోమవారం కలిసిన కాపు ఫెడరేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎంను సోమవారం అఖిల భారత కాపు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు గొర్రిపాటి అర్జునరావు, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులివెంకట విజయభాస్కర్ ఆధ్వర్యంలో సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాపులు, బలిజలను బీసీలుగా గుర్తించి తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు సీఎం చంద్రబాబును సన్మానించారు. కాపులు, బలిజలను బీసీలుగా గుర్తించి తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని తక్షణం ఆమోదం తెలపాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడానికి 13 జిల్లాల్లోనూ ఆందోళనలు చేయనున్నట్లు చెప్పారు. లక్షలాది మంది డిమాండ్‌ను ఆమోదించడకుండా కాలయాపనతో పొద్దుపుచ్చుతున్న కేంద్రం మొండి వైఖరికి నిరసనగా ప్రదర్శలను నిర్వహిస్తామని సీఎంకు తెలిపారు. ప్రథమంగా ఒంగోలులో 24న ఒక రోజు నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. అదే విధంగా మిగిలిన జిల్లాల్లోనూ, తదుపరి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్షలు చేస్తామన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రిని కలిసిన కాపు ఫెడరేషన్ నాయకులు