ఆంధ్రప్రదేశ్‌

ప్రతిష్ఠాత్మకంగా వృక్షమిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 20: రాష్ట్రంలో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రతి నెలా నాలుగో శనివారం రాష్టవ్య్రాప్తంగా వృక్షమిత్ర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మొక్కలు నాటటంతో పాటు వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)పై సచివాలయంలో సోమవారం సమీక్ష జరిపారు. మొత్తం 23 ప్రభుత్వ శాఖల్లో నరేగా పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 25న నిర్వహించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేసి విద్యార్థులను భాగస్వాములు చేయాలన్నారు. ప్రతి నాలుగో శనివారం ఒకపూట విద్యార్థులను తప్పకుండా కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. మొక్కలు నాటటం వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్లకార్డులు చేతపట్టుకుని గ్రామాలు, మండలాలు, మునిసిపాల్టీలలో ర్యాలీలు నిర్వహించాలని నిర్దేశించారు. ముఖ్యంగా అటవీ, పంచాయతీరాజ్, విద్యాశాఖలు మొక్కలు నాటే కార్యక్రమంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. నరేగా ఇతర నిధులతో వేసిన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. వృక్షమిత్ర కార్యక్రమంలో డ్వాక్రా సంఘాలను కూడా మమేకం చేయాలన్నారు. అటవీ, మునిసిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపడుతున్న పనులపై సీఎం ఆరా తీశారు. అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిశుభ్రత ఉంటే వ్యాధులు ప్రబలే వీలు ఉండదన్నారు. విశాఖపట్నంలో డెంగ్యూ అదికంగా ఉందని అందుకుగల ప్రధాన కారణాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించి తక్షణమే అమల్లోకి తీసుకురావాలన్నారు. గత ఏడాది కంటే మలేరియా 64 శాతం, డెంగ్యూ 17 శాతం తగ్గిందని అధికారులు వివరించారు. వ్యాధుల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు సాయిప్రసాద్, గిరిజాశంకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..నరేగాపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు