బిజినెస్

ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో ఇక వాణిజ్యపర కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: గత దశాబ్దాల తరబడి ఏపీఎస్ ఆర్టీసీ దాదాపు రూ. 3,900 కోట్ల నష్టాలతో కొట్టుమిట్టాడుతూ ముందుకు సాగుతుంటే కార్మిక, ఉద్యోగ, అధికారులు అందరూ కలిసి ఎంతగా శ్రమిస్తున్నా ఆశించిన ఫలితాలు చేకూరటం లేదంటూ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతో మాట్లాడుతూ ఈ సంస్థ పురోభివృద్ధికి తాజాగా ఎండీ సురేంద్రబాబుతో కలిసి సీఎం చంద్రబాబు సలహాలకు లోబడి తాము చేపడుతున్న సంస్కరణల గురించి క్షుణ్ణంగా వివరించారు. అందరం కల్సి కష్టించి ప్రయాణికుల సంఖ్యను గణనీయంగా పెంచడం వల్ల 2016-17లో రూ. 435 కోట్లు మేర నష్టాలు తగ్గగా, 2017-18లో రూ. 735 కోట్లు మేర నష్టాలు తగ్గాయని అన్నారు. అయితే ఈ సంతోషం ఎంతో కాలం నిలువలేదని డీజిల్ లీటర్‌కు రూ. 7 పెరగడం వలన సాలీనా తాము వినియోగించే 30 కోట్ల లీటర్ల వినియోగంపై దాదాపు రూ. 210 కోట్లు పైగా అదనపు భారం పడినట్లయిందన్నారు. ఖాళీగా ఉన్న విలువైన ఆర్టీసీ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించదలచామన్నారు. బీఓటీ లేక పీపీపీ పద్ధతిలో ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించదలచామన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర, అహ్మదాబాద్ బస్ స్టేషన్‌ల తరహాలో ముఖ్యమైన బస్‌స్టేషన్‌లను అతి పెద్ద షాపింగ్ సెంటర్‌లుగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. బస్సు దిగే ప్రయాణికులు కాస్తంత సేపు బస్‌స్టేషన్ ప్రాంగణంలోనే షాపింగ్ చేసుకోవటం లేదా సినిమా చూడటం ఇతరాత్రా వినోదం, విహారానికి అవసరమైన సౌకర్యాలు, ఫుడ్ కోర్టు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. కార్గో సర్వీస్‌ను బలోపేతం చేస్తున్నామని, ఇప్పటికే రూ. 100 కోట్లు రాబడి సాధించామన్నారు.