ఆంధ్రప్రదేశ్‌

ఆతిథ్య రంగం అభివృద్ధి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రెండువేల ఇరవై నాటికి 20 మిలియన్ విదేశీ పర్యాటకుల ఆకర్షణ లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) మేధోమథనం సాగిస్తోందని అధ్యక్షుడు ప్రణబ్ సర్కార్ స్పష్టం చేశారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి నాలుగు రోజుల పాటు ఐఏటీవో 34వ సమావేశాలు విశాఖలో జరుగుతాయన్నారు. పర్యాటకాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో ‘మిషన్ 20 మిలియన్ టూరిస్ట్స్ - ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజస్’ థీమ్‌తో ఈ సారి సమావేశాలు జరుగుతాయన్నారు. కేంద్ర పర్యాటక శాఖతో ఐఏటీవో కలిసి పనిచేస్తుందన్నారు. సమావేశానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజీ అల్ఫోన్స్ సహా పలువురు కేంద్ర అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారన్నారు. పర్యాటకాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ఇదే సందర్భంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చిస్తామన్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించే క్రమంలో స్టార్ హోటల్ ఆతిథ్యం వసతి సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వాటర్ స్పోర్ట్స్, అడ్వంచరస్ స్పోర్ట్స్ తరచూ నిర్వహించాలన్నారు. విమాన, రోడ్డు కనెక్టివిటీ సదుపాయాలు మెరుగుపడాలన్నారు. సదస్సు చైర్మన్ రాజీవ్ మెహ్రా మాట్లాడుతూ వచ్చే ఏడాదికి విదేశీ పర్యాటకుల సంఖ్య 20 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇటీవల తాము చేపట్టిన సర్వేలో ఆతిథ్య రంగంలో వసతి కొరత, దర్శనీయ స్థలాల విశేషాలను వివరించే గైడ్‌ల కొరత స్పష్టంగా కన్పించిందన్నారు. ఈ సవాళ్లను అధిగమించగలిగితే దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించి, పర్యాటకాన్ని విస్తృత పరచగలమని అభిప్రాయపడ్డారు.
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ హిమాంశు శుక్లా మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఐఏటీవో సదస్సు వేదిక కానుందన్నారు. సుమారు 900 మందికి పైగా జాతీయ స్థాయి టూర్ ఆపరేటర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారని, పలు రాష్ట్రాల పర్యాటక శాఖా మంత్రులు, విదేశీ ప్రతినిధులు, విమానయాన సంస్థల యాజమాన్యాలు హాజరవుతున్నాయన్నారు. ఐఏటీవో సదస్సు ద్వారా రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన అవగాహన రానుందన్నారు. సమావేశంలో విశాఖ నగరాభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్ పీ బసంత్ కుమార్, ఐఏటీఓ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ ఈఎం నజీబ్, గౌరవ కార్యదర్శి రాజేష్ ముద్గిల్, సదస్సు చైర్మన్ రాజీవ్ మెహ్రా తదితరులు మాట్లాడారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఐఏటీవో చైర్మన్ ప్రణబ్ సర్కార్