ఆంధ్రప్రదేశ్‌

నిర్లక్ష్యంగా ఉంటే ఎవర్నీ వదలిపెట్టను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 5: ‘మీ నిర్లక్ష్యం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయి.. మీ బాధ్యతా రాహిత్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారుతోంది.. ఇదేతీరున వ్యవహరిస్తే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటిస్తాం.. అసమర్థంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. డెంగ్యూ నియంత్రణపై బుధవారం జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ, మునిసిపల్, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాలు, వార్డులలో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాం.. పారిశుద్ధ్యం మెరుగు పరిచాం..పచ్చదనం పెంచుతున్నాం.. అయినా వ్యాధులు ప్రబలటం దురదృష్టకరమన్నారు. అన్ని చర్యలు తీసుకుంటున్నా డెంగ్యూ మహమ్మారి వెంటాడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ నగరానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. నాలుగేళ్లలో ఎంతో ప్రగతి సాధించాం.. ఇంకా అంటు వ్యాధులు వ్యాప్తిచెందడం బాధాకరమన్నారు. మరో రెండు రోజుల్లో వ్యాధులను పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య చర్యల్లో మార్పులు రావాలన్నారు. మూడు జిల్లాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి.. అధికారుల పనితీరు నిరాశ కలిగిస్తోంది.. వారి సమర్థతను శంకించాల్సి వస్తోందన్నారు. విశాఖలో 33, గుంటూరులో 20 హాట్‌స్పాట్లలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని నిర్దేశించారు. విశాఖ, అనంతపురం, గుంటూరు, విజయనగరం జిల్లాలపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. అన్నిరకాల ముందు జాగ్రత్తలు చేపట్టాలని, అధికారుల అసమర్థత వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కారాదన్నారు. మాకేమిటిలే అనే నిర్లక్ష్యాన్ని సహించను..ఎవరినీ ఉపేక్షించేదిలేదు.. బాధ్యతారాహిత్యాన్ని అసలు సహించనని స్పష్టంచేశారు. అన్ని జిల్లాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని సూచించారు. వ్యాధి నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పట్టణాల్లో మెప్మా కార్యకర్తలు చురుగ్గా స్పందించాలని కోరారు. వైద్య, ఆరోగ్య, మునిసిపల్, పంచాయతీరాజ్‌శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి హాట్‌స్పాట్ బాధ్యత ఒక సీనియర్ అధికారికి అప్పగించాలన్నారు. అవసరాన్ని బట్టి పనివారిని పెంచుకోవాలని, పారిశుద్ధ్య లోపం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉండరాదన్నారు. రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ ముమ్మరం చేయాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్లు చేసి యుద్ధ ప్రాతిపదికన ఉపశమన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెరుగైన జీవన పరిస్థితుల కల్పన మనందరి బాధ్యత ప్రజారోగ్యం పరిరక్షణ కోసమే మనం ఉన్నదని ఉద్ఘాటించారు. విధి నిర్వహణలో ఎవరు విఫలమైనా ఉపేక్షించేదిలేదని మరోసారి హెచ్చరించారు. మురుగునీటి నిల్వ ప్రదేశాల్లో ఆయిల్‌బామ్స్ వేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు. ద్రోన్ల ద్వారా హాట్‌స్పాట్లను గురించి తక్షణమే ఆయా ప్రాంతాల్లో వ్యాధి నియంత్రణలోకి వచ్చేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం.. అధికారుల పనితీరుపై ప్రజల్లో సంతృప్తి ఉండాలన్నారు.