ఆంధ్రప్రదేశ్‌

సమ్మె విరమించకుంటే... తీవ్ర పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: సమ్మె విరమించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆర్జీయుకేటీ కాంట్రాక్టు సిబ్బందికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఆర్జీయుకేటీ అధికారులతో బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఆర్జీయుకేటీ వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని కోరారు. నూజివీడు ఐఐఐటి, ఆర్కే వ్యాలీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఎంప్లారుూస్ తమ జీతాలు పెంచాలని కోరుతూ ఇచ్చిన సమ్మె నోటీసును ఉపసంహరించుకుని, ప్రభుత్వంతో చర్చలు జరిపితే వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు ఎంప్లారుూస్ జీతభత్యాలు, రాష్ట్ర వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఎంప్లారుూస్ జీతభత్యాల్లోని వ్యత్యాసాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్జీయుకేటి అధికారులు మాట్లాడుతూ తమకు శాశ్వత సిబ్బంది లేరని, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని మంత్రికి తెలిపారు. ఈ అంశంపై సీఎంతో చర్చించామని, మంజూరైన శాశ్వత పోస్టుల్లో మూడోవంతు పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు సీఎం అంగీకరించారని మంత్రి తెలిపారు. పోస్టుల భర్తీకి ఒక కమిటీని ఏర్పాటు చేసు, మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ఆర్జీయుకేటీలో సెకండరీ ఫేజ్ అడ్మిషన్ల నిలిపివేతపై న్యాయ సలహా తీసుకోవాలని ఆదేశించారు. ఆర్జీయుకేటీ చట్టంలో ఉన్న ఇతర అంశాలను పరిశీలించాలని, పీయుసీ-1, 2 సిలబస్‌లో మార్పులు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్, ఆర్జీయుకేటీ వీసీ రామచంద్రరాజు, డైరెక్టర్లు పాల్గొన్నారు.