ఆంధ్రప్రదేశ్‌

పోర్టులతోనే పారిశ్రామికాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 5: సంకల్పబలంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విజ్ఞప్తి చేశారు. విభజనతో ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపర్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవల్‌పమెంట్ అధారిటీ (ముడ) చైర్మన్‌గా నియమితులైన బూరగడ్డ వేదవ్యాస్ ప్రమాణ స్వీకారోత్సవం కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హోం శాఖ మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ అమరావతి రాజధానితో బందరు ఓడరేవు నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత సమీపంలో ఉన్న బందరు ఓడరేవును అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతానికి గత వైభవం రావటంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పని చేసి పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకు రావాలని సూచించారు. ముఖ్యంగా పోర్టుకు భూములు ఇచ్చే రైతుల సహకారం తీసుకుని పోర్టు నిర్మాణంలో వారిని కూడా భాగస్వాములను చేయాలన్నారు. పోర్టుకు అనుకూలంగా ఇప్పటికే విజయవాడ నుండి మచిలీపట్నానికి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, మచిలీపట్నం - విజయవాడ రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అనుబంధ పరిశ్రమలతో వేలాది మంది ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత వెంకట్రావ్, అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప