ఆంధ్రప్రదేశ్‌

11న విజయవాడలో కేశఖండనతో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: సీఎం చంద్రబాబు గత మే నెల 31వ తేదీన ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఈ నెల 11వ తేదీన విజయవాడ లెనిన్ సెంటర్‌లో కేశఖండన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, హైకోర్టు దృష్టికి చేరే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అసోసియేషన్ రాష్ట్ర సమితి సమావేశం బుధవారం విజయవాడలోని దాసరిభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యానికి నిజాయితీ ఉంటే వారు దాచుకున్న మొత్తంలో రూ.వెయ్యి కోట్లను కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు న్యాయం చేయవచ్చని సూచించారు. హైకోర్టులో కేసు వాయిదాలకు నిరసనగా ఈ నెల 24న గుంటూరులో మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు.