ఆంధ్రప్రదేశ్‌

ఫొటో మీది... పరిష్కారం మాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: ప్రజలు తమ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణా లోపాలకు సంబంధించి ఫోటోలు పంపితే, పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రియల్ టైమ్ గవర్నెన్సు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. అపారిశుద్ధ్యానికి సంబంధించి ఫోటోలను పీపుల్ ఫస్ట్, ఖైజాలా, ఎన్‌సీబీఎన్ యాప్‌లకు పంపితే, అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలోని అపారిశుద్ధ్య సమస్య లేకుండా చేయడంతో పాటు మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి జ్వరాలు ప్రబలకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. ప్రజలు తమ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య సమస్యలను ఫోటోలు తీసి ఆ మూడు యాప్‌ల్లో అప్‌లోడ్ చేయాలని కోరింది. పేరుకుపోయిన చెత్త, మురుగు నీరు నిలిచి ఉండటం, కాలువలు శుభ్రం చేయకపోవడం, దోమల సమస్య వంటివి పంపాలని కోరింది. సమస్య ఉన్న ఊరు, వీధి, ప్రాంతం వివరాలను కూడా అందులో పేర్కొనాలని సూచించింది. ఆ సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీజీఎస్ తెలిపింది.