ఆంధ్రప్రదేశ్‌

సీఎంతో కోమటి జయరాం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: అమెరికాలో ఉన్న తెలుగువారిని రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములను చేయాలని అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం సీఎంతో కోమటితో భేటీ అయ్యారు. రాష్ట్భ్రావృద్ధికి సంబంధించి వివిధ అంశాలను చర్చించారు. అమెరికాలో అనేక సంఘాలుగా, వర్గాలుగా ఉన్న తెలుగువారిని ఏకం చేసి, పార్టీకి విస్తృతంగా సేవలు అందించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోనూ ఏ రాష్ట్రం చేయని విధంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు ఏపీలో అమలు జరుగుతున్నాయని, వాటిలో ప్రవాసాంధ్రులు కూడా పాలుపంచుకునేలా చేయాలని తెలిపారు. సేంద్రియ వ్యవసాయంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ఈ నెల చివరి వారంలో అమెరికాలో సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలన్నారు.