ఆంధ్రప్రదేశ్‌

విశాఖ ఉక్కు నిర్వాసితుల ఆర్-కార్డు బదిలీకి ఉత్తర్వులు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: విశాఖ ఉక్కు కర్మాగార నిర్వాసితులకు సంబంధించి ఆర్-కార్డును బదిలీ చేసేందుకు కొన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్- కార్డు కలిగి ఉండి 40 సంవత్సరాలు దాటిన, విశాఖ ఉక్కు కర్మాగారం ఉపాధి కల్పించని నిర్వాసితులు తమ ఆర్-కార్డులను బదిలీ చేసే వీలును కల్పించింది. ఈ విధమైన ఆర్- కార్డు కలిగి ఉన్న వారు తమ కార్డును తమ పెద్ద కొడుకు లేదా కూతురుకు, పెద్ద మనవడికి లేదా పెద్ద మనవరాలి పేర బదిలీ చేయవచ్చు. పెళ్లి అయినా, కాకపోయినా కూతురు, మనవరాలు కూడా అర్హులు. పై మూడు సందర్భాల్లో అర్హులు లేకపోతే, ఆ ఆస్తితో సంబంధం ఉన్న సమీప బంధువు పేర బదిలీ చేయవచ్చు. విశాఖ జిల్లా కలెక్టర్ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.