ఆంధ్రప్రదేశ్‌

నేడు టీడీపీలోకి కొండ్రు మురళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 5: శ్రీకాకుళం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గురువారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ స్పీకర్ కె ప్రతిభాభారతి కొండ్రు చేరికను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. కొండ్రు రాక ఖాయమనే విషయం తెలుసుకున్న ప్రతిభాభారతి అలకపూనారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు బుధవారం ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. మురళి చేరికను ప్రస్తావించడంతో పాటు రాజాం నియోజకవర్గంలో పార్టీలో గ్రూపుల పోరును ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పార్టీ పటిష్టతకు చేరికలు తప్పవని చంద్రబాబు వారించినట్లు తెలిసింది. మున్ముందు చేరికలు కొనసాగుతాయని ఎవరు వచ్చినా మీ ప్రాధాన్యత మీకే ఉంటుందని భరోసా ఇవ్వటంతో ప్రతిభాభారతి సంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.