ఆంధ్రప్రదేశ్‌

‘మార్చి నాటికి రాజధానిలో నిర్మాణాలు పూర్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: రాజధాని అమరావతి పరిధిలో జరిగే అభివృద్ధి పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని పరిధిలో జరుగుతున్న రోడ్లు, భవనాల పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. వెంకటాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి పర్యటన ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఎఎస్ అధికారుల గృహ సముదాయాల నిర్మాణాన్ని పరిశీలించారు. నేలపాడులో నిర్మిస్తున్న ఏన్జీవోల గృహాలను, ఈ-6 రోడ్డును ఆయన పరిశీలించారు. అనంతరం రాయపూడిలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాజధానిలో 1600 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేపట్టామన్నారు. 34 రోడ్ల నిర్మాణం ప్రారంభమైందని, 320 కిలోమీటర్లలో 220 కిలోమీటర్లకు సంబంధించి టెండర్లు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులకు కూడా త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో మంచినీరు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, గ్యాస్ పైపులైన్లు, స్మార్ట్ వాటర్, సీవరేజ్ వాటర్ పైపు లైన్లు కలిపి నిర్మిస్తుండటం వల్ల రోడ్ల నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతోందని వివరించారు. 2019 మార్చి నాటికి రోడ్లు, భవన సముదాయాలు వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. రాజధానిలో పరిపాలనా నగరాన్ని 1450 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, ఇందులో ఐఎఎస్ అధికారులకు 432, ఎన్జీవోలకు 1995, గ్రూపు-డి ఉద్యోగులకు 1444 అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, ఇందులో 221 అపార్టుమెంట్లకు మొదటి శ్లాబులు పూర్తయ్యాయన్నారు. ఒకసారి మొదటి శ్లాబ్ పూర్తి అయితే నెలకు 250 నుంచి 500 శ్లాబ్స్ వేయవచ్చన్నారు. వర్షాకాలం వల్ల పనుల్లో పురోగతి కొంత తగ్గుతుందని, సిటీ సివిల్ కోర్టుపనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని, అప్పటికి అందుబాటులోకి వస్తుందన్నారు.
రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయలను స్టాక్ మార్కెట్ నుంచి సేకరించామన్నారు. బ్యాంక్‌ల నుంచి 10 వేల కోట్ల రూపాయలు రుణం కావాలంటే 2000 కోట్ల రూపాయల మేరకు మ్యాచింగ్ గ్రాంట్‌గా ఉంచాల్సి ఉంటుందన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్న తరుణంలో ఇది సాధ్యం కాదన్నారు.