ఆంధ్రప్రదేశ్‌

బాబుకు కన్నా మరో ఐదు ప్రశ్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: వెనుకబడ్డ ప్రకాశం, కడప జిల్లాలకు వర ప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేని ఈ అసమర్థ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఉందా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారం వారం ఐదేసి ప్రశ్నలు సంధిస్తున్న కన్నా బుధవారం మరో ఐదు ప్రశ్నలు సంధించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి అహర్నిశలు పాటుబడుతున్నామని చెప్పే బాబు విజయనగరం జిల్లా అభివృద్ధిని తుంగలో తొక్కలేదా అని అడిగారు. తోటపల్లి రిజర్వాయర్ ఫీల్డ్ ఛానెల్స్‌ను పూర్తి చేయలేదు.. మేనిఫెస్టోలో చేర్చిన సాలూరు బైపాస్ మంజూరు, జూట్ మిల్లులను తెలిపించడంలో విఫలమై పది వేల మంది కార్మికుల భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టి వేయటం వాస్తవం కాదా అని నిలదీశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంక్ వచ్చిందని పదేపదే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి.. టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, వారి బంధుమిత్రులకు సంబంధించి పరిశ్రమలు, వ్యాపారాలు ఇతర రాష్ట్రాల్లో ఎన్ని పెట్టారు, సొంత రాష్ట్రంలో ఎన్ని పెట్టారో నిజాయితీగా చెప్పగలరా అని అడిగారు. అవినీతి రహిత సుపరిపాలనను అందిస్తామంటున్నారు కదా.. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను పక్కనబెట్టుకుని తాము అవినీతికి పాల్పడలేదని చెప్పగలరా అని నిలదీశారు.