ఆంధ్రప్రదేశ్‌

ఉల్లి, టమాటా నిల్వలకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: మదనపల్లి మార్కెట్‌లో ఉల్లి, టమాటా నిల్వకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం రాత్రి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష ఆయన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిట్టుబాటు ధర లభించే వరకూ సబ్సిడీ ఇచ్చి రైతును ఆదుకోవాలన్నారు. ఆగస్టులో క్వింటాలు ఉల్లి 700 రూపాయలకుపడిపోవడం సహజమేనని, నవంబర్‌లో టమాటా ధరలు క్వింటాల్‌కు 700 నుంచి 1400 రూపాయలు, ఉల్లి 700 నుంచి 1500 రూపాయలకు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉల్లి నిల్వ సదుపాయాలను పెంచాలని, రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గుతాయన్నారు. మదనపల్లిలో ప్రస్తుతం క్వింటాలుకు టమాటా 500 రూపాయలు, ఉల్లి 820 రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవసాయ సీజనులో పంటలకు చీడ, పీడలు సోకకుండా అధికారులు, శాస్తవ్రేత్తలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నా, పంటలను కాపాడకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎక్కడ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందో అక్కడికి నీరు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, అధికారులు బాధ్యతతో వ్యవహరించి అప్రమత్తం కావాలన్నారు.