ఆంధ్రప్రదేశ్‌

సభ్యుల ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 5: శాసనసభ, మండలిలో సభ్యులడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానాలివ్వాల్సిందే అని మండలి చైర్మన్ ఎండి ఫరూక్, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. గురువారం నుంచి జరిగే సమావేశాల నిర్వహణపై బుధవారం స్పీకర్ ఛాంబర్‌లో అధికారుల సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. జీరో అవర్‌లో శాసనసభ్యులు, మండలి సభ్యులు తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి వేదికగా చేసుకుంటారని ప్రజాస్వామ్య వ్యవస్థలో సభ్యులడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు అధికంగా వస్తాయని, ఫరూక్ తెలిపారు. ఏజన్సీ ప్రాంతంలో ప్రబలుతున్న వ్యాధులకు సంబంధించి ఈ సమావేశాల్లో సభ్యులు ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వపరంగా తీసుకుంటున్న ఉపశమన చర్యలను వివరించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్యను ఆదేశించారు.
ఇవే చివరి పూర్తిస్థాయి
సమావేశాలు కావచ్చు
గురువారం నుంచి జరిగే సమావేశాలే దాదాపు చివరి సమావేశాలు కావచ్చని చెప్తూ ఓట్ ఆన్ అకౌంట్‌కు ముందు నాలుగురోజుల పాటు సాగే సమావేశాలు ఉండవచ్చని కోడెల తెలిపారు. కార్యదర్శులు, అధికారులు సమావేశాలు జరిగే రోజుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు రాకపోతే అసంతృప్తి చోటుచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అంతకు ముందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోడెల, ఫరూక్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్‌కుమార్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
బందోబస్తుపై సమీక్ష
వర్షాకాల సమావేశాల సందర్భంగా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని మండలి చైర్మన్ ఫరూక్ పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశాలు పూర్తయ్యే వరకు శాసనసభ, మండలి ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ విషయమై అసెంబ్లీ కమిటీ హాలులో పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుతో కలసి సమావేశం నిర్వహించారు. సమావేశాల సందర్భంగా సామాన్యులను ఇబ్బంది పెట్టరాదని ఎవర్నీ నొప్పించ రాదన్నారు. విజిటర్స్‌కు ఇచ్చే పాస్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అనుమతించాలన్నారు. డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ మాట్లాడుతూ అసెంబ్లీ పరిసరాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామని, బందోబస్తు నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేటు వాహనాల్లో వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా తమకు సమాచారం అందిస్తే ఎలాంటి తనిఖీలు నిర్వహించమని చెప్పారు.