ఆంధ్రప్రదేశ్‌

తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 6: దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గరగపర్రులో ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు దళితుల పట్ల వివక్ష చూపుతున్న తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యద్దని పలువురు దళిత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీనిపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో గురువారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ఐక్య బహిరంగ సభలో ఈమేరకు నేతలు ప్రకటించారు. పీవీ రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మాదిగ సంఘం, గిరిజన పరిరక్షణ సమితి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్, సంచార జాతులు, బీజేపీ ఎస్సీ మోర్చా తదితర ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర సంఘాల నేతలు హాజరయ్యారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు జె రాములు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ రావు మాలమహానాడు గరగపర్రు ఉద్యమ నాయకుడు సిరింగుల వెంకటరత్నం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ గరగపర్రులో పర్యటించి బర్త్‌డే కేకులు కట్ చేయించుకుని అగ్రవర్ణాలకు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. గరగపర్రు ఘటన జరిగి 17 మాసాలు గడిచినా ప్రభుత్వం సమస్యను పరిష్కరించలేదన్నారు. అక్కడ నాలుగు వందల కుటుంబాలు వెలికి గురైతే కేవలం 265 కుటుంబాలకే పరిహారం చెక్కులు అందించారన్నారు. దళిత నేత జాన్ కెనడీ మాట్లాడుతూ ఇది ఎస్సీ, ఎస్టీ ఐక్య బహిరంగ సభ కాదని, గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేయనందుకు నిరసన సభగా నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని ఎస్సీలంతా గరగపర్రు వైపు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఇక్కడివారు తీసుకున్న నిర్ణయం మేరకే 20 లక్షల దళిత కుటుంబాలు వ్యవహరిస్తాయన్నారు. కాగా సమావేశంలో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు వారికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి గరగపర్రు సమస్యను మంత్రి ఆధ్వర్యంలో తీసుకువెళ్లామన్నారు. తప్పులు జరుగుతుంటాయని, సరిచేస్తామన్నారు.