ఆంధ్రప్రదేశ్‌

ఉల్లి, టమాట రైతులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 6: పెట్టుబడులు గణనీయంగా పెరగడం, మార్కెట్‌లో ధర పడిపోయిన నేపథ్యంలో ఉల్లి, టమాటా రైతులను ఆదుకోవాలని పలువులు ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. చైర్మన్ ఎన్‌ఎండి ఫరూఖ్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర శాసనమండలి సమావేశమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందా అని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ప్రశ్నించారు. పెట్టుబడులు పెరిగాయని, కనీస మద్దతు ధర పెంచాలని కేంద్రానికి సిఫారసు చేసిన మేరకు పెంచారా? అని అడిగారు. కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ సీజను ప్రారంభంలో మామిడి పంట టన్ను 75 వేల రూపాయలు పలికిందని, తరువాత 15 వేల రూపాయలకు పడిపోయిందని, ఉల్లి కూడా 3000 రూపాయల నుంచి 750 రూపాయలకు పడిపోయిందని తెలిపారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఏపీలో రైతు ఆత్మహత్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉల్లి, టమాటా ధరలు పడిపోవడం సహజం అంటూ రైతులను అనాథల్లా వదిలేయడం సరికాదన్నారు. ఉల్లిని కిలో 15 చొప్పున కొని, మార్కెట్‌లో 18 రూపాయల చొప్పున విక్రయించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో మామిడి సిండికేట్లు ఏర్పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ చిత్తూరులో తోతాపురి మామిడిని కొనేందుకు పంజాబ్‌నుండి కొంతమంది వస్తే, జూస్ అసోసియేషన్ల ప్రతినిధులు దాడులు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దీనిపై మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. మామిడి, టమాటా, ఉల్లికి కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించలేదన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మొక్కజొన్న, మామిడి రైతులను ఆదుకున్నామని తెలిపారు. కేంద్రానికి ఏపీ అంటే చిన్నచూపు అని, కనీస మద్దతు ధర ప్రకటించకుండా మోసం చేస్తోందని ఆరోపించారు.
బియ్యం ధరలను పర్యవేక్షిస్తున్నాం: పుల్లారావు
మార్కెట్‌లో బియ్యం ధరలను పర్యవేక్షిస్తున్నామని, బియ్యాన్ని 50 రూపాయలు, అంతకన్నా ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నిత్యావసర ధరలు అసాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పెరగడంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వేసిన ప్రశ్నపై మంత్రి స్పందిస్తూ, రైతు బజార్లలో సన్నబియ్యం కిలో 36 రూపాయలకు విక్రయిస్తున్నామని, పంచాదారపై కేంద్రం సబ్సిడీ ఎత్తివేసినా, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ సరఫరా చేస్తోందన్నారు. అంతకు ముందు వీర్రాజు మాట్లాడుతూ మార్కెట్‌లో 40 రూపాయలకు మించి కిలో బియ్యం విక్రయిస్తే తీసుకుంటామన్నారని చెప్పారని, కానీ మార్కెట్‌లో 50 రూపాయలు, అంతకుమించి విక్రయిస్తున్నారని, దీనిపై కనీస చర్యలు లేవని ఆరోపించారు. పౌరసరఫరాల శాఖ చర్యలు లేకపోవడం వల్ల రైతులు, వినియోగదారులు నష్టపోతుండగా, మిల్లర్లు, దళారులు లాభపడుతున్నారని విమర్శించారు.
కడప ఉక్కు, మన్నవరం విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి?
కడప ఉక్కు కర్మాగారం, మన్నవరం విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో వివరించాలని పలువురు ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో గత నాలుగు సంవత్సరాల్లో ఏర్పాటైన పరిశ్రమల గురించి చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ కడప ఉక్కు కర్మాగారం ఎప్పుడు వస్తుందని, ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మూత పడిన పరిశ్రమల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. వై శ్రీనివాసులు మాట్లాడుతూ మన్నవరం ప్రాజెక్టు రాకపోతే జాతికి భవిష్యత్తు ఉండదన్నారు. విఠపు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అప్పటి ప్రధాని శంకుస్థాపన చేసిన మన్నవరం ప్రాజెక్టు తలుపులు ఇప్పటి కేంద్ర ప్రభుత్వం మూసేసిందన్నారు. దీనికి ఎవరు జవాబు చెబుతారన్నారు. దీనిపై మంత్రి అమరనాథ్ రెడ్డి బదులిస్తూ, కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల్లో ఉద్యోగాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందన్నారు. చేపల ఉత్పత్తుల దిగుమతిపై ఈశాన్య రాష్ట్రాల్లో నిషేధంపై వివివి చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి ఆదినారాయణ రెడ్డి బదులిస్తూ, రాజకీయంగా కక్ష కట్టారని, ఈశాన్య రాష్ట్రాలు దుష్ప్రచారం చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఫార్మాలిన్ వాడుతున్నట్లు ఒక్క నమూనాలో కూడా నిర్ధారణ కాలేదన్నారు. టీటీడీ నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా సెలక్ట్ కమిటీని నియమించనున్నట్లు రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. టీచర్ల నియామకంపై నిషేధం ఉన్న కారణంగా గంటల ప్రాతిపాదికపై ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. భాషాపండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా స్థాయిని పెంచే పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ఇందుకు సానుకూలంగా ఉందన్నారు.
అన్న క్యాంటీన్లపై మండలిలో వాడీవేడి చర్చ
అన్న క్యాంటీన్లపై టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీల మధ్య రాష్ట్ర శాసన మండలిలో గురువారం వాడివేడి చర్చ జరిగింది. క్యాంటీన్ల ఏర్పాట్లు ఎన్నికల ప్రచారంగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యనించగా, సభలోని టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడి, వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ జనార్ధన్ చాలా సేపు పేదల కోసం ప్రారంభించిన పథకాలపై వివరణ ఇచ్చారు. అనంతరం అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ ప్రకటన చేశారు. రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని, మరో 104 ప్రారంభిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసేలా మరో 100 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణయించామని, త్వరలోనే వీటి స్థలాలు ఖరారు చేసి ప్రారంభిస్తామన్నారు.