ఆంధ్రప్రదేశ్‌

నారా సైన్యం... బ్రాహ్మణ సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 6: వచ్చే సాధారణ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు వెంట ఉండేలా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా తన వంత బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తెలిపారు. కార్పొరేషన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 13 జిల్లాల డీఎల్‌ఓలకు నాయకత్వ లక్షణాలు పెంపుపై మంగళగిరిలో జరుగుతున్న రెండు రోజుల శిక్షణను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో చైర్మన్ ఆనంద సూర్య మాట్లాడుతూ దేశంలోని మొదటి సారిగా బ్రాహ్మణులకు కార్పొరేషన్ పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వందే అన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్‌లో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక డీఎల్‌ఓ పని చేస్తున్నారని త్వరలోనే మండలానికి ఓ మండల మిత్రని నియమిస్తామని అన్నారు.
వారు ఆ మండలంలోని బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలిసి కార్పొరేషన్, సొసైటీ కార్యకలాపాలు చెప్పడం, వాటి లబ్ధిని పొందేలా దరఖాస్తులు పెట్టించడం చేయాలన్నారు. శ్రీపాద రామ్, ఆత్రేయలు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. నాయకునిగా ఎలా ఎదగాలి, విజయం సాధించడానికి ఎలా సాధన చేయాలి తదితర అంశాలు బోధించారు. కార్పొరేషన్ ఎండీ ఎం పద్మ కార్పొరేషన్ పథకాల అమలు గురించి ఆరా తీశారు. జనరల్ మేనేజర్లు భవాని శంకర్, వెంకట శాస్ర్తీ, సొసైటీ ఈఓ నాగసాయి, డైరెక్టర్‌లు సుబ్బారావు, యామిజాల నాగరాజు, ఓఎస్‌డీ శర్మ, పీఆర్‌ఓ ఈమని సూర్యనారాయణ, డీఎల్‌ఓలు జనార్ధన్, గురు రాఘవేంద్ర, కామేష్, డీహెచ్‌వి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.