ఆంధ్రప్రదేశ్‌

పోలీసు అమరుల స్థలిలో ఏపీ పోలీసు బృందం నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 6: ఇండో-టిబెట్ సరిహద్దు ప్రాంతంలోని పోలీసు అమరుల స్థలిని ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం సందర్శించింది. ఏపీ ఇంటిలిజెన్స్ ఎస్పీ ఆర్ జయలక్ష్మీ నేతృత్వంలోని 23మంది సభ్యుల ప్రత్యేక పోలీసు బృందం ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకునే 60వ పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీసు బృందం ఈయాత్ర చేపట్టింది. దేశవ్యాప్తంగా పది మంది ఐపిఎస్ అధికారులు, ఒక ఆర్‌పిఎఫ్, ఏడుగురు గజిటెడ్ ఆఫీసర్స్, ఐదుగురు ఎన్‌జీఓలతో కలిసి మొత్తం 23మంది సభ్యుల బృందానికి ఐపిఎస్ అధికారిణి జయలక్ష్మీ నేతృత్వం వహించారు. చండీఘర్ నుంచి కులు, లేహ్ మీదుగా లడక్ సమీపంలోని ఇండో టిబిట్ సరిహద్దు పర్వత శిఖరాన్ని అధిరోహించారు. చైనా దాడుల్లో హోరాహోరీగా పోరాడి 1959 ఆక్టోబర్ 21వ తేదీన అమరులైన మన దేశ సైన్యం ప్రాణత్యాగానికి గుర్తుగా ఈప్రాంతాన్ని పరిగణిస్తున్నారు. గత నెల ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగింది. ప్రతికూల వాతావరణంలో సైతం సముద్ర మట్టానికి 16వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతానికి 1200 కిలోమీటర్ల మేర సాహసోపేతంగా కొనసాగింది. ప్రత్యేక పోలీసు బృందం అక్కడకు చేరుకుని అమరుల ప్రాణత్యాగాన్ని స్మరించుకుని నివాళి అర్పించారు. అమరుల త్యాగ స్ఫూర్తితో తమ బృందం ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుందని నేతృత్వం వహించిన ఎస్పీ జయలక్ష్మీ పేర్కొన్నారు. విజయవంతంగా యాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన బృందాన్ని డీజీపీ ఆర్‌పి ఠాకూర్ ప్రత్యేకంగా అభినందించారు. కాగా.. ఇండో-టిబెట్ బోర్డర్ ఫోర్స్ ఎస్పీ జయలక్ష్మీకి ఈ సందర్భంగా సర్ట్ఫికెట్ అందచేసింది.