ఆంధ్రప్రదేశ్‌

ప్రతిపక్ష హోదా వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 7: ప్రతిపక్షం గైర్హాజరైనా శాసనసభ సమావేశాలు బాగా జరిగాయనే పేరురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యానికి ప్రజలే సమాధానం చెప్తారు.. సభకు ఎందుకు రారని ఇప్పటికే ఉపాధ్యాయులు నిలదీశారు.. మనం ప్రతిపక్షం కోసం పనిచేయటంలేదు.. ప్రజలను మెప్పించే వ్యూహాలు ఉండాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. శుక్రవారం శాసనసభ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ, శాసనమండలిలో అధికారపక్ష సభ్యులుగా అర్థవంతమైన చర్చ జరపాలి..అనుబంధ ప్రశ్నల ద్వారా లోతైన చర్చ జరిగేలా శ్రద్ధ చూపాలన్నారు. విషయ పరిజ్ఞానంతో వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడే వ్యూహాత్మకంగా వ్యవహరించరాదు.. స్వల్ప, దీర్ఘకాలిక చర్చలపై తగిన సంకేతాలు ప్రజలకు అందించాలని ఆదేశించారు. ప్రజలు అన్నింటినీ నిశతంగా పరిశీలిస్తున్నారు.. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు.. ప్రతికూల స్వభావాన్ని సహించరన్నారు. అసెంబ్లీకి ఎందుకురారనే ప్రశ్నకు జవాబివ్వలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు.. అన్నివర్గాల ప్రజల్లో ప్రతిపక్షంపై వ్యతిరేకత ఉంది.. ప్రాథమిక బాధ్యతలను వైసీపీ విస్మరించిందని విమర్శించారు. సభకు హాజరుకాని సభ్యత్వం వృథా అన్నారు. ప్రతి సమావేశానికి హాజరు కావటం సభ్యుని ప్రాథమిక బాధ్యత.. ప్రతి కదలికను ప్రజలు బేరీజు వేస్తున్నారు.. సభకురాని సభ్యుల పేర్లు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఉద్బోధించారు.