ఆంధ్రప్రదేశ్‌

15నుంచి కన్నా రాష్టవ్య్రాప్త పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 7: ఈ నెల 15వ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరులో జరిగిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కార్యదర్శి పీసీ సత్యమూర్తి శుక్రవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. 16న వాజ్‌పేయి కవితలపై కావ్యాంజలి కార్యక్రమం, 17 నుంచి వారం పాటు దీనదయాళ్ సేవ సప్తాహ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టటంలో ప్రతిపక్షాలు నిదురపోతున్నాయన్నారు. తాత్కాలిక భవనాల నుంచి అమరావతి బాండ్ల వరకు అంతా అవినీతిమయమయిందన్నారు. కమ్యూనిస్టులు కూడా అవినీతిని ప్రశ్నించటం లేదన్నారు. ఎంతసేపూ కేంద్రం నుంచి నిధులు రావటం లేదంటూ ఉద్యమాలు చేస్తున్నాయంటూ విమర్శించారు. అందుకే బీజేపీ తరపున గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు చేపడుతున్నామన్నారు.

‘ప్రత్యేక పే-స్కేల్స్ వర్తింప చేయండి’

విజయవాడ, సెప్టెంబర్ 7: జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రత్యేక పే-స్కేల్స్ వర్తింప చేయాలని ఏపీ 11వ పే రివిజన్ కమిషనర్‌కు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. రెవెన్యూ సిబ్బంది 100 రకాల చట్టాల అమల్లో, 19 ప్రభుత్వ పథకాల అమల్లో కీలక పాత్ర వహిస్తున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక స్కేల్స్ ఇవ్వాలని, రెవెన్యూ శాఖను సాధారణ శాఖగా గుర్తించాలని కోరారు. ఈ మేరకు తమ డిమాండ్లతో వినతిపత్రాన్ని కమిషనర్‌కు విజయవాడలో అందచేసింది.