ఆంధ్రప్రదేశ్‌

రాజ్యాంగాన్ని తగలబెట్టడం హేయమైన చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, సెప్టెంబర్ 7: భారత ప్రజలందరికీ ఆరాధ్యుడైన బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరగరాస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం అత్యంత దుర్మార్గమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మతాన్మోదులు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టి, 120కోట్ల ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారన్నారు. ఈ నెల 22న గుంటూరులో నిర్వహించే భారత రాజ్యాంగ పరిరక్షణ మహార్యాలీకి రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగాంలో శుక్రవారం శివాజీ విలేఖర్లతో మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. వారికి రక్షణ కవచంలాంటి రాజ్యాంగాన్ని ఢిల్లీ నడిబొడ్డులో తగలపెడుతుంటే కేంద్ర ప్రభుత్వం కిమ్మనకపోవటం శోచనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఏకమై దళిత ఉద్యమాలు చేస్తుంటే ‘దళిత’ అనే పదం లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందన్నారు. చివరకు ఆంక్షల ద్వారా పత్రికా స్వేచ్ఛను సైతం హరించే స్థితికి కేంద్రం చేరుకుందన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్లరద్దు వంటి చర్యలతో పేదవాడి నడ్డివిరిచే ప్రయత్నం చేశారన్నారు. బ్యాంకులను దివాలాతీసే దుస్థితికి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, దీనితో ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. విలేఖర్ల సమావేశంలో అజ్జరపు వాసు, గొల్లపల్లి గోపి, కాకర శ్రీను, మోకాటి నాగేశ్వరావు, ఉప్పూడి బాబి, కె నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.