ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి పనుల్లో రూ. 7.42 కోట్ల దుర్వినియోగం: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో ఉపాధి పనుల్లో సామాజిక ఆడిట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 7.42 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర శాసన మండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి పనుల్లో అవినీతి కార్యకలాపాలపై తీసుకున్న చర్యల గురించి ఎమ్మెల్సీ శమంతకమణి ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2007 -2018 వరకూ ఆ మొత్తం దుర్వినియోగమైనట్లు గుర్తించామన్నారు. 10 మందిపై సస్పెన్షన్ వేటు వేశామని, 1833 మంది వ్యక్తులను తొలగించామన్నారు. 2384 మందికి శిక్ష విధించామని, 51 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద 399 కేసులను ప్రతిపాదించామని వెల్లడించారు. ఇప్పటి వరకూ 2.39 కోట్ల రూపాయలను రాబట్టామన్నారు. కాంగ్రెస్ హయంలో 8 సంవత్సరాల్లో 5.57 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని, టీడీపీ హయాంలో 1.86 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పనుల్లో అవినీతి శాతం 2.83 కాగా, తమ ప్రభుత్వంలో 0.38 శాతం మాత్రమేనని వివరించారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఉపాధి పనులు అమలు చేస్తున్నామని, పంజాబ్, అరుణాచల ప్రదేశ్ ఇక్కడ పథకం అమలు తీరును అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు.
అన్ని పాఠశాలలకు ప్రహరీలు
ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రహరీలను నిర్మించనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఎమ్మెల్సీలు సూర్యారావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, 2363 పాఠశాలలకు 264 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. మొదటి దశలో 314 పాఠశాలలకు ప్రహరీ నిర్మాణానికి 85 కోట్ల రూపాయల మెటీరియల్ అంశానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు.