ఆంధ్రప్రదేశ్‌

తీరుమారకుంటే సస్పెన్షనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 8: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రబలుతున్న అంటువ్యాధుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లా అధికారులు, కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌తో పాటు రియల్‌టైం ద్వారా నేరుగా ఆయా జిల్లాల ప్రజలతో పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు.
మురుగుకాల్వలు క్రమం తప్పకుండా శుభ్రపరుస్తున్నారా..లేదా.. మీ ఇంటి పరిసరాల్లో ఫాగింగ్ జరిగిందా.. డెంగీ, మలేరియా అధికారులు మీ గ్రామాన్ని సందర్శించారా అనే వివరాలను నేరుగా ప్రజలనడిగి తెలుసుకున్నారు. 108 సేవలపై కూడా ఆరా తీశారు. ఏ ప్రాంతంలో ఏ వ్యాధి ప్రబలుతోంది..అక్కడ తక్షణమే ఎలాంటి వైద్య సేవలు అందించాలి..పారిశుద్ధ్యం, మంచినీటి క్లోరినేషన్.. రక్షిత మంచినీటి సరఫరా.. అంశాలను పర్యవేక్షించారు. వైద్యశాఖ, పట్టణాభివృద్ధి.. గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాబోయే రెండువారాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరచాలని నిర్దేశించారు. తాగునీటిని అందుబాటులో ఉంచాలని.. ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మురుగు నిల్వలు లేకుండా క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలన్నారు
. బ్లీచింగ్ చల్లటంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగే విధంగా ప్రజలను చైతన్యరచాలన్నారు. రెండు రోజుల్లో మార్పు రాకపోతే అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అసమర్థత.. నిర్లక్ష్యాన్ని సహించేదిలేదు.. బాధ్యతా రాహిత్యాన్ని ఉపేక్షించం.. కింది నుంచి పై స్థాయి వరకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మనం ఉన్నది ప్రజల కోసమే.. వారికి సేవలందించటానికే.. అంటువ్యాధులు ఎందుకు నియంత్రించ లేకపోతున్నారని అధికారులను నిలదీశారు. ఎక్కడ విఫలమయ్యారో గుర్తించి అక్కడే ఎందుకు మకాం వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సమగ్ర సమాచారం ఉంది.. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొందరు చేసిన తప్పులకు ప్రభుత్వానికి చెట్డపేరు రావటాన్ని సహించేది లేదన్నారు. హుదుద్ తుపాన్ సమయంలో ఉన్నట్టే విశాఖకు నేనే వచ్చి వారం రోజులు మకాంవేస్తా.. మానవ తప్పిదాలు క్షమార్హం కాదన్నారు. ప్రతి స్థాయిలో సమన్వయం, సమర్థత ఉండాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల యోగక్షేమాలు విచారించాలన్నారు. వ్యాధిగ్రస్తులకు వైద్యం అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఆపదలో అండగా నిలవటం మన కర్తవ్యమని హితవు పలికారు. అసెంబ్లీకి ప్రస్తుతం సెలవులు.. ఎంపీలకు పార్లమెంటు సమావేశాల్లేవు.. అంతా క్షేత్రస్థాయిలో ఉండి ఆరోగ్య జాగ్రత్తలపై ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో అంటు వ్యాధుల బెడద తగ్గుముఖం పట్టినా ఒక్క విశాఖలోనే ఎందుకు విజృంభిస్తున్నాయని అధికారులను నిలదీశారు. వివరణలు, సంజాయషీలు కోరటంలేదు..్ఫలితాలు ముఖ్యమన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ కానీ, సలహాదారు కానీ ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు వెళ్లాలంటే నువ్వు వెళ్లాలని వాదులాడుకోవటం వల్ల పరిస్థితి అదుపు తప్పుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతిరోజు హెల్త్, శానిటేషన్ బులిటెన్లు విడుదల చేయాలన్నారు. ఆర్టీజికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఏ విధంగా స్పందించారనే అంశాలను రోజావారీ బులిటెన్లలో వెల్లడించాలని ఆదేశించారు. విశాఖలో 72 వార్డులకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ముమ్మరం చేయాలని సూచించారు. మురుగు నిల్వలపై ఆయిల్‌బామ్‌లు విడుదల చేయాలన్నారు. బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టి క్లోరిన్ టాబ్లెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. మురుగునీటి నిల్వలను గుర్తించి ద్రోన్ల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే కేసులన్నింటినీ జియో ట్యాగింగ్ చేసి వ్యాధి సోకిన బాధితుల ఇంటి పరిసరాల్లో వంద ఇళ్లను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అంటువ్యాధులు తీవ్రం అయ్యాక నివారణ చర్యలు చేపట్టటంకాదు.. ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సెలవులు రద్దు చేసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మరోసారి హెచ్చరించారు.