ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 8: అంగన్‌వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తీసుకున్న చిన్నారులు వాంతులు, వీరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని ఎజి కొడేరు గ్రామంలోని అంగన్‌వాడీ-1 కేంద్రంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి చిన్నారులు యధావిధిగా వెళ్లారు. పిల్లలకు 11 గంటల సమయంలో అంగన్‌వాడీ టీచరు పాలు, గుడ్లు ఆహారంగా ఇచ్చారు. వీటిని తీసుకున్న కొంత సమయం తరువాత చిన్నారులు ఒక్కసారిగా వాంతులు, వీరేచనాలు చేసుకోవడం మొదలయ్యాయి. ఇంటికి వెళ్లిన చిన్నారులు ఇంటి వద్ద సైతం వాంతులు, వీరేచనాలు ఎక్కువ అవ్వడంతో పిల్లలకు ఏమయ్యిందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వాంతులు, వీరేచనాల నుంచి పాలు, గుడ్ల వాసన వస్తుండటంతో కలుషిత ఆహారం తినడం వల్ల అయి ఉంటుందని భావించి తల్లిదండ్రులు చిన్నారులను హుటాహుటిన చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. వైద్యురాలు కళ్యాణి చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యసేవలందించారు. ఆసుపత్రిలో సైతం చిన్నారులకు వాంతులు, వీరేచనాలు తగ్గలేదు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్యులు చిన్నారుల తల్లిదండ్రులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో అభిషిక్త్ కిషోర్ ఏరియా వైద్యశాలను సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పీవో అభిషిక్త్ కిషోర్ విలేఖర్లకు తెలిపారు.
ఆదివాసీ చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడిన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. కారకులపై చర్యలు తీసుకోకపోతే ఇటువంటి చర్యలే మళ్లీ మళ్లీ పునరావృతమవుతాయని శ్రీను ఆరోపించారు.

చిత్రాలు..అస్వస్థతకు గురైన చిన్నారులు * కుళ్లిన కోడిగుడ్లు (ఇన్‌సెట్‌లో)