ఆంధ్రప్రదేశ్‌

నాడు దెయ్యం..నేడు దేవతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 8: గతంలో కాంగ్రెస్‌ను దెయ్యంగా అభివర్ణించిన చంద్రబాబుకు నేడు ఆ పార్టీ దేవతలా కనిపిస్తోందా అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన పరిస్థితులో కాంగ్రెస్ పార్టీని పాతరేయాలని పిలుపు ఇచ్చిన బాబు మాత్రం నేడు తన రాజకీయ లబ్ధి కోసం అదే పార్టీని కౌగిలించుకునేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం ఈనాటిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే ఆ సిద్ధాంతాలను అమ్మకానికి పెట్టే నూతన సిద్ధాంతానికి చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. నైతిక విలువలు లేని చంద్రబాబు మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని, నేడు కాంగ్రెస్‌తో సిగ్గులేకుండా పొత్తుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పొత్తులను చూసి ఎన్టీఆర్, హరికృష్ణల ఆత్మలు క్షోభిస్తాయన్నారు. కేంద్ర మాజీమంత్రి చిదంబరం నుండి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు అందరితో చంద్రబాబు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి ఎటువంటి అవకాశాలు లేవన్నారు. థర్డ్ ఫ్రంట్ లేదా బీజేపీ అధికారంలోని వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విభజన సమయంలో హోదా ఇవ్వని కాంగ్రెస్, ఇప్పుడు మాత్రం హోదా ఇస్తానని అనడం ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. రాయలసీమలో కరవు తాండవిస్తుంటే రెయిన్ గన్స్ ద్వారా పంటలు కాపాడానని చెబుతున్న చంద్రబాబు మాటలన్నీ అబద్దాలేనన్నారు. రెయిన్ గన్స్‌తో ఒక్క ఎకరం కూడా కాపాడలేదన్నారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. ఒక్క రైతైనా పంటలు కాపాడారని చెబితే రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. వైకాపా ఏనాడూ బీజేపీతో కలవనే కలవదన్నారు. సిద్ధాంతాలు పక్కన పెట్టి చంద్రబాబు మాత్రం నేడు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారన్నారు. ప్రజాసమస్యలపై నోరెత్తితే అసెంబ్లీలో మైకులు కట్ చేస్తుంటే అసెంబ్లీకి ప్రతిపక్షం ఎందుకు రావాలో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మైకుల కోసం ప్రతిపక్షాలు ధర్నా చేసే పరిస్థితులు చంద్రబాబు తీసుకు వచ్చారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకుంటే మరుక్షణమే అసెంబ్లీకి రావడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.